సింగల్ మామ్

ఏంటి ఏమైనా ఆలోచించావా ఋషి? ఎం ఆలోచించాలి కావ్య? ఒడిదుడుకులు లేకుండా జీవితం ఉండదు అంటారు, ఆలా వచ్చి ఒడిదుడుకులు ఎంత మంది నెగ్గుకు రాగలుగుతున్నారు?వచ్చిన చిన్న చిన్న కష్టాలకు భయపడిపోతున్నారు, చాల అనుభవించాను అయినా ఇలా ఉండిపోవాలని ఎవరు అనుకోరు, కానీ జంటగా ఉండే కన్నా ఒంటరి లైఫ్ బెటర్ అని ఆలోచించ అంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడకపోతే ఈ నిర్ణయానికి వొస్తాను చెప్పు కావ్య? నేను అడిగేది అది కాదు, మల్లి పెళ్ళికి ఏమైనా ఆలోచించావా? ఎలా ఎన్నాళ్ళు ఉండగలవు? కచ్చితంగా జేవితానికి తోడు ఉండాలి. అది అర్ధం చేసుకో ఋషి. నీకు నా లైఫ్ గురించి లైఫ్ లో పడిన గురించి తేలేదు..

మల్లి పెళ్లా, ఆమ్మో ఆ చేదు అనుభవాలు గుర్తుకొస్తున్నాయి. అసలు ఆలోచన తలుచుకుంటే భయం వేస్తుంది కావ్య. ప్రేమించా అన్నాడు, నువ్వు లేకపోతె చచ్చిపోతా అన్నాడు. బావే గా మామ కొడుకేగా ఎక్కడికి పోతాడు చెంగున ముడేసుకోవచ్చు అనుకున్న, వాడు చూపించిన ప్రేమకి, అత్తయ్య మావయ్య వాళ్ళు చూపించే అనురాగం కి, మా అమ్మ నాన్న కూడా అనుకున్నారు ఇంత కన్నా దగ్గర్లో ఇస్తే పిల్లని బాగా చూసుకుంటారు, అర్ధం చేసుకుంటారు, మాకు కూడా భయం ఉండదు, ఎవరు వస్తారో, ఎలాంటి వాళ్ళు వస్తారో అని పెళ్లి చేసారు. కానీ పెళ్లి అయ్యాక తెలిసింది వాడో చీటర్ అని అత్తయ్య వాళ్ళకి తెలిసిన కూడా న డబ్బు , అమాయకత్వం చూసి ఇంతకన్నా జడ్డిది మాకు దొరకదని చేసుకున్నారు, మంచితనాన్ని కాస్త అలుసుగా తీసుకున్నారు. చిన్న వయసు లోనే జీవితాన్ని చదివేసా ఆ మహానుభావుడు వళ్ళ. ఇప్పుడు ఎవరిని నమ్మాలన్న నమ్మలేకపోతున్నా, అమ్మాయి adjust అవ్వక తప్పదు. అసలు మగవాడు అంటేనే తిక్కలోడు. ఒక్కొక్కడికి ఒక్కో తిక్క, ఇంకా ఇగో కూడా ఎక్కువ. మన అమ్మలు, పెద్దమ్మలు, పిన్నిలు అత్తలు లైఫ్ లు వాళ్ళ అనుభవాలు తెలుసుకున్న తెలుస్తుంది. ఏంటి ఋషి జీవితాన్ని చదివేసావు ఎన్నోన్నో మాటలు చెప్తున్నావ్. అవునే పడిన బాధలు అలాంటివి.

ఇంకా గుర్తుంది. బాబు గాడు కి అప్పుడే మాటలు వస్తున్నాయ్, ప్రతిదీ స్పష్టంగా మాట్లాడేవాడు. ఏడుస్తుంటే నాన్న గురించా అమ్మ ఏడవకు అని కళ్ళు తుడిచేవాడు. పోత్త్తిళ్లలో బాబులా అనిపించేవాడు. 25 ఏళ్ళు వయసులో, బాబు గాడిని పట్టుకొని, వాడి భవిష్యత్తు ఏంటో, న భవిష్యత్తు ఏంటో అర్ధం కాకా చాలా ఏడ్చేసా. వాడికి తండ్రిని కూడా నేనే అవ్వాలి, నన్ను నేను దృడంగా మార్చుకోవాలి, ఇంకా జీవితం లో ఎవరిని నమ్మకూడదు అని నిశ్చయించుకున్న. అమ్మ వాళ్ళు నాకు తోడుగా ఉన్నారు, అన్నయ్య నాకు అండగా ఉన్నాడు, ఇంకా ఎం ఆలోచించలేదు. సంపాదన మీద ద్రుష్టి పెట్టా. నా కొడుకు కి నేను ఎప్పటికి సూపర్ మామ్ లనే ఉండాలి. కానీ ప్రతి రోజు నాకు జరిగిన అన్యాయం కి ఏడుస్తూనే ఉన్న.

సింగల్ మామ్ లా జీవితాన్ని నెట్టుకు రావటం చాల కష్టం. ఎన్నెన్నో మాటలు, నచ్చినట్టు తయారైన భయమే, సమాజం లో అమ్మలక్కలు ఏ మాటలు అంటారో అని. సింగల్గా నడుచుకుంటూ వెళ్లాలన్న భయమే, ఏ వెధవ ఏ వాగుడు వాగుతాడో అని, కానీ నేను కంచుకోటలో ఉన్న మహారాణి ల ఉన్నానే , మా అమ్మ వాళ్ళు కట్టారు ఆ కోట,నాకు నేను ముళ్ళకంచె వేసుకున్న. ఎవరో ఏదో చేసేస్తారని కాదు, నా మీద చెడు ఆలోచనే వాళ్ళకి రానియ్యకుండా చూసుకోవాలి. ఒంటరిగా బ్రతకటం చాల కష్టమే, ఏ వెధవ నుంచి ఏ మాట వినాలో, నా బ్రతుకు నేను బ్రతుకుతున్న భయం, ఎవరితో అయిన నవ్వుతు మాట్లాడుతున్న భయమే నలుగురు ఏమనుకుంటారో అని భయం, ఎవరికీ లింకులు పెట్టేస్తారో అని, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్న కనుక నాకు అలాంటివి తగలలేదు, పక్కనే భర్త ఉన్న ఆ ఆడదాన్ని ఎలా పడేయాలి అనుకుంటారు, ఇంకా నాలా ఉన్నారు అని తెలిస్తే ఇంకా చూస్తారు. పనికిమాలిన వెధవలు ఎవడు ఎదురుకాకూడదు అని నాకు తగలకూడదు అని అనుకుంట, బయటకు ఎల్తే మొదటి ప్రశ్నమీ వారు ఏరి? ఎం చేస్తారు అని? చచ్చాడు అని చెప్తే ఎలా అని అడుగుతారు. డివోర్స్ అంటే ఎందుకు అని అడుగుతారు. అయినా నా జీవితం గురించి వీళ్ళకి ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది. ఆ situation ని కూడా పేస్ చేయలేము.

చుట్టాల పెళ్ళికి వెళ్లిన, ఫ్రెండ్స్ ని కలిసిన, తెలిసిన వాళ్ళని కలిసిన, అందరికి మా ప్రేమ గురించి తెలియటం తో మర్చిపోదాం అన్న గుర్తు చేసి మరి ఏడిపిస్తారు, అన్ని ఉన్న ఎం లాభం ఉండాల్సిన భర్త పక్కన లేదు అని ఎత్త్తి చూపిస్తారు. నేను చేయని తప్పుకి నేను ఎందుకు ఎడ్వాలి అని అర్ధం కాదు. అమ్మాయిల బాధే కష్టం. బాబు గాడికి ఏమి తెలియని వయసులో ఉన్నాడు, పెద్దవాడు అవుతాడు,వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, నాన్న చచ్చిపోయాడు అని చెప్పా, అదే నిజం అనుకున్నాడు, నమ్మాడు. రేపు ప్రశ్నిస్తాడో , అర్ధం చేసుకుంటాడో కూడా తేలేదు, ఎప్పుడైనా ఇంట్లో సమస్య వచ్చిన నువ్వే చేతులారా చేసుకున్నావ్ అనే మాటలకి ఏడ్వాలో, నిజమ్ నేనే న జీవితం నాశనం చేసుకున్న అని ఏడవాలో అర్ధం కాదు.జీవితం బాగుండాలనే స్టెప్ తీసుకున్న, కానీ ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదు.

డబ్బు విషయం వచ్చిన, ఎవరో ఏదో అన్న, ఏ విషయం గురించి మాట్లాడుకున్న కచ్చితం గ తిరిగి తిరిగి నా విషయం కి వచ్చి ఆగుతుంది. జరిగిపోయిన గతం మారదు, మారాలన్న జీవితం ముందు ఎలా ఉంటుందో తెలీదు. నేను ఎం చేయగలను దేనికి జవాబు చెప్పగలను. మల్లి పెళ్లి చేసేయండి , ఇంకా చిన్నదే కదా జీవితం చాల ఉంది, ఒంటరిగా నెట్టుకు రావడం కష్టం అంటారు. సలహాలు ఇవ్వటం చాల తేలిక, వచ్చే వాడు మంచోడు కావాలి, బుద్ధిమంతుడు అవ్వాలి, బాబు ని accept చేస్తాడో లేదో? చేసిన తర్వాత గొడవలు వస్తాయేమో, చేసిన బాబు గాడు ఎలా ఉంటాడో? నేనే కాకుండా న కొడుకు కూడా జీవితం లో adjustments కి అలవాటు పడాలి., ఒకవేళ మంచోడే అయ్యి , నన్ను బాగా చూసుకొనే వాడు వస్తే పర్లేదు, లేదంటే మల్లి మొదటికే వస్తే ఈసారి మరి జీవించాలన్న ఆశ కానీ, జీవితం పైన ఆసక్తి కానీ ఉండదు.సింగల్ మామ్ కి నిజంగానే challenges, adventures ఎక్కువ.

ఇన్ని సమస్యలకు, ప్రశ్నలుకు జవాబులు ఎలా దొరుకుతాయే కావ్య? నువ్వు చెప్పు ఇప్పుడు ఏది బెటర్ నా లైఫ్ కి? ఋషి ఆలోచించాకే నిర్ణయం తీసుకో, సారీ నువ్వు చెప్పింది నిజమే సలహాలు ఇవ్వటం చాల తేలిక, నేక్ ఏది మంచిది అనిపిస్తే అది చేయు. నే కొడుకు నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు ఎప్పటికి సూపర్ మామ్ లనే ఉండాలి. నేను మా ఇంటికి వెళ్తానే , ఇక ఎప్పుడు నిన్ను బాధపెట్టేలా మాటాడను.