బస్ స్టాప్ ప్రేమ

అరేయ్ రాజా ఏంటి రా ఇంకా పడుకొని ఉన్నావ్, మనము ఇంకా డిగ్రీ కాలేజీ అనుకున్నావా? MCA కి వచ్చేసాం, కాలేజ్ పక్కనే కాదు. మనం రెండు గంటల ముందు బయలుదేరాలి. R.T.C బస్సు ఎక్కాలి , సీట్స్ దొరకకపోతే నించోవాలి, ఇంకా లే బాబు రెడీ అవ్వు.. ఉండరా ఐదు నిమిషాలలో రెడీ అంటూ బయల్దేరారు, కాలేజీ కి మొదటి రోజు ఏమి తెలియదు. బస్టాప్ లో బస్సు గురించి వేచి చూస్తుండగా బస్సు రావటం చాలామంది పిల్లలు బస్సు ఎక్కటం ఐపోయింది మరో 10 నిమిషాలలో ఇంకో బస్సు రావటం మల్లి స్టూడెంట్స్ తో బస్సు నిడిపోవటం జరిగింది, ఏంటిర బస్సు ఎంత రష్గ ఉంటె డైలీ మనం ఎలా వెళ్తాము.

కాలేజీ కి టైం కి వెళ్ళగలమా అనుకుంటూ ఉంటుండగా పక్క నుంచి నవ్వులు వినిపిస్తే అటోకసారి చూడగానే చాల మంది ఆడపిల్లలు నవ్వుతున్నారు, ఎందుకో అందులో ఒక అమ్మాయి చాల ఆక్టివ్గా గట్టిగ నవ్వుతు అందరిని ఆటపట్టిస్తూ ఉంది. రాజా చూడగానే మనసు పారేసుకున్నాడు.. ఉరేయ్ ప్రదీప్ ఆ అమ్మాయి ని చూడరా ఎంత బాగుంది.

రాజా ఇది ఫస్ట్ డే రా అప్పుడే అమ్మాయిలు ఏంటి రా, అది కాదు రా ప్రదీప్ అయినా మన డిగ్రీ లో అందరు చింపిరి జుత్తులేసుకొని వచ్చేవారు, ఇక్కడేంటి ర అమ్మాయిల? అప్సరసలా ?అన్నట్టు ఉన్నారు. అనవసరం గా డిగ్రీ జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేసాము. మనము బీటెక్ లో జాయిన్ అయ్యి ఉంటె,

ఆపురా కళలు మాని బస్సు వస్తుంది ఎక్కు, ఇదే బస్టాప్ కి రోజు వస్తాం. అంటూ బస్సు ఎక్కి కాలేజీ కి వెళ్లారు, కానీ రాజా కి మాత్రం ఆ అమ్మాయి నవ్వు ఆ అమ్మాయి మాత్రమే కాళ్ళ ముందు కనిపిస్తుంది. సాయంత్రం మల్లి కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేప్పుడు బస్టాప్ లో అదే అమ్మాయి, హమ్మయ్య మనసుకి ప్రశాంతం గ ఉంది. రోజు రెండు సార్లు ఆ అమ్మాయిని చూడచ్చు అనుకుంటూ బస్సు ఎక్కుతాడు.

ఇంటికి వెళ్ళాక ఉరేయ్ ప్రదీప్ ఆ అమ్మాయి ఎంత బాగుంది రా, ఆ బావుంది అంత అందం గా అంత ఆక్టివ్ గ ఉండే అమ్మాయిలకు ఎవరు లైన్ వేయఉండా ఉంటారా అది ఆ పిల్ల బీటెక్ చూసుకోరా. మరుసటి రోజు ఆ అమ్మాయి ఎక్కే బస్సు ఎక్కటం ఆ అమ్మాయి వెనుకనే నిల్చోవటం ఇలా రోజు ఫాలో ఐపోతుండటమే పనిగా పెట్టుకున్నాడు రాజా..

ఆ అమ్మాయి పేరు అప్సరనే పేరు కి తగ్గట్టే అప్సరసలా ఉంటుంది. రోజు రాజా వెనుక ఫాలో అవ్వటం గమనించి ఒకరోజు అడిగేస్తుంది, ఏంటి ఫాలో అవుతున్నావా నన్ను? ఆబ్బె లేదండి అప్సర గారు, మీది నది బస్టాప్ ఒకటే కాలేజీ ఒకటే అందుకే మ్రు ఆలా అనుకుంటున్నారు అని మాట దాటేస్తాడు, మనసులో తన మీద ప్రేమ ఉన్న మాట దాటించేస్తాడు..

కానీ ఆ అమ్మాయికి ఎలా నా ప్రేమను చెప్పాలి అనుకుంటూ, రాణే వచ్చింది ఫస్ట్ సెమిస్టరు కానీ చదువుని మాత్రం పక్కన పెట్టకుండా, కాలేజీ ఫస్ట్ వస్తాడు, కానీ రోజు అప్సరని మాత్రం ఫాలో ఐపొతూ తనలోనే థానే ప్రేమించేసుకుంటాడు. రాణే వచ్చింది కాలేజీ ఫెస్ట్, అందులో రాజా కి ఫస్ట్ వచ్చినదుకు కాను 10,000/- రివార్డ్ తీసుకుంటాడు యాజమాన్యం తో,

అప్సర బస్టాప్ దగ్గర తన దగ్గరకు వచ్చి కాంగ్రేజ్స్ మజ్ను అంటూ పలకరిచింది. గాలిలో తేలిపోతూ మాటలు కలిపాడు, మజ్ను ఏంటి ? న పేరు రాజా అంటూ, కాదు మహా ప్రభు రోజు వెంట పడతావ్ గా అందుకే మజ్ను అన్నా మహప్రభు, ఇంతలో రాజా కలుగచేసుకుంటూ మరి నువ్వు నాకు లైలా కావచ్చుగా అంటాడు. అప్సర నవ్వుతు వెళ్లిపోతుంది.

ఇంకా వెనుక పడి నెంబర్ తీసుకుంటాడు. ఇంకా ప్రతి రోజు చాటింగ్ లు వీడియో కాల్స్ మాట్లాడుకోడాలు సినిమాలు షికార్లు ఇలా సంవత్సరం గడిచిపోతాయి. కానీ తన బీటెక్ కూడా కంప్లీట్ ఐపోతుంది. ఇంకా ఎలా డైలీ కలుసుకోవటం అనుకుంటూ ఉండగా ఇంతలో అప్సర కి క్యాంపస్ ఇంటర్వ్యూ లో విప్రో లో జాబ్ వచ్చింది. కానీ రాజా కి మాత్రం తనకి జాబ్ వచ్చినదుకు హ్యాపీ గాను కానీ తనను వేడి వెళిపోతుందని బాధ గాను అనిపించింది. కానీ అప్సర కి మాత్రం బీటెక్ అవ్వగానే జాబ్ వచ్చినదుకు చాల సంతోషంగా అనిపించింది..

మరుసటి రోజు సాయంత్రం ఒక పార్క్ లో కలుసుకున్నాక అప్సర, ఎలా రాజా ఒక పక్క నీతో ఉండాలని ఉన్న! నా కెరీర్ మాని ఉండలేను. విప్రో లో జాబ్ నాన్నా కల, నన్ను చదివించినదుకుగాను నేను ఇచ్చే బహుమతి జాబ్ లో సీట్లే అవ్వటం, జాబ్ వచ్చింది ఇంకో రెండు రోజుల్లో చెన్నై లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నేను వెళ్తాను అంటూ మనం డైలీ కలవకపోవచ్చు కానీ ఫోన్ చేస్తా అంటూ రాజా ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది.
రాజా ప్రేమించుకున్న అందరు కలిసి ఉండకపోవచ్చు, కానీ నా నమ్మకం ప్రకారం దూరం గా వున్నా ప్రేమలో ఉన్నవాళ్ళ మనుసులు ఒకేదగ్గర ఉంటాయి అంటూ చెప్పాడు, నాకు ఇంకో 2 సంవత్సరాల చదువు ఉంది, నేను కచ్చితం గా క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతా, కానీ నా చదువు ఐనంతవరుకు నాకు జాబ్ వచ్చేవారుకూ నువ్వు ఇంట్లో పెళ్లి మాట ని దాటేయాలి నాకు మాట ఇవ్వు అప్సర అంటూ వాగ్దానం తీసుకుంటాడు.

కానీ మనసులో బాధ పడుతూనే అప్సర చెన్నై కి, రాజా మరుసటిరోజు నుంచి కాలేజీ కి వెళ్తాడు, కానీ ప్రతి రోజు వెళ్లే బస్టాప్ అతని ప్రేమని, నడిచే దారి నీ ప్రేయసి ఎక్కడ అన్నట్టు, ఎప్పుడు వెళ్లే పార్క్ తన ఙ్ఞాపాకాలను, పూచే చెట్టు తన నవ్వును, వీచే గాలి తన పరిమళాన్ని, పారె నది తన ఒంపుసొంపులును గుర్తు చేస్తున్నాయ్. ప్రేయసి జ్ఞాపకాలను తన మాటలను తను గుర్తుచేసుకుంటూ ఈరోజుకి తాను వెళ్లిపోయి 6నెలలు కావస్తుంది, కానీ అప్సర ఒక్కసారి కూడా కాల్ చేయలేదు, అంటే నా ప్రేమను తాను టైంపాస్ అనుకుంది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు,

ప్రదీప్ వచ్చి తనను ఓదార్చి స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేసేలా చేస్తాడు, దానితో MCA లో గోల్డ్ మెడల్ వచ్చి క్యాంపస్ లో విప్రో లోనే సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కి చెన్నై చేరుకుంటాడు. ట్రైనింగ్ అయ్యాక హైదరాబాద్ లో తన పోస్టింగ్ వేస్తారు, కానీ ప్రేయసిని మర్చిపోలేక ఇంకో అమ్మాయి ని మనసులో కూడా ఊహించడు. కానీ హైదరాబాద్ లో తాను ఆఫీస్ లో అడుగు పెట్టగానే తన అప్సర కనిపిస్తుంది.

కానీ తన మనసుని ముక్కలు చేసి ఎక్కడ హాయ్ గ ఉంది అనుకుంటు అడుగులు వేస్తాడు, కానీ ముందుకు వెళ్లి చూడగా తన కాలికి మట్టెలు, ఓహ్ పెళ్లి కుడి చేసుకున్నారా మేడమ్ గారు అనుకుంటూ తన సీట్ లో కూర్చున్నాడు, ఇంతలో అప్సర తనని చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ నిన్ను జన్మ లో చూస్తా అనుకోలేదు, కానీ చూసా, చెన్నై కి నాన్నా అమ్మ కూడా తోడు గ వచ్చారు అనుకున్న నన్ను ట్రైనింగ్ పంపేటప్పుడు కానీ వచ్చిన రాజే నాకు పెళ్లి అని తెలుసుకోలేకపోయా, పెళ్లిన తర్వాత నీతో మాట చెప్పిన నువ్వు ఏ చేసుకుంటావో అని చెప్పలేదు, నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంది, కానీ తన మీద కోపం పోయి నువ్వు నీ భర్త తో హాయ్ గా ఉండు నన్ను ఎప్పుడు గుర్తుకు తెచుకోకు అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతాడు,

ప్రేమించిన మనసులు ఎప్పుడు ఒకటి కాకపోవచ్చు, కానీ ఒక్కటి అవ్వాలని చేయడానికి చేసే ప్రయత్నం లో లోపం ఉండకూడదు. ప్రేమే జీవితం, ప్రేమించిన వారే లోకం అనుకోకుండా ముందు లైఫ్ లో సెటిల్ అవ్వాలి. ప్రేమించే మనిషి తో జీవితం పంచుకోవటం ఒక అదృష్టం ఐతే, కొంతమంది ప్రేమని స్వార్ధానికి ఉపయోగించుకోవటం దురదృష్టం.