సందిగ్ధం లో ప్రేమ తో స్నేహం

అరేయ్ వినయ్ ఆ అమ్మాయే రా! చూడరా ఎంత అందంగా ఉంది ఏదో తెలియని కల, ఆ అమ్మాయిలో ఎప్పుడు నవ్వుతు, అల్లరి చేస్తూ, చిలకల మాట్లాడుతుంది. ఇంతలో వినయ్ మాటాడుతూ మధు ఒకటి తెలియక అడుగుతున్న ఏ అమ్మాయి ని చుసిన, ఎంత అందం గా ఉన్న పట్టించుకోని నువ్వు ఆ అమ్మాయిని చూసి అంతలా ఇష్టపడుతున్నా వేంటిరా, నీకోసం శ్యామల ఎప్పటినుంచో ట్రై చేస్తుంది. అయిన ఆ అమ్మాయి ఏజ్ కూడా చిన్న అమ్మాయి ల కనిపిస్తుంది. ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు, అసలు ఆ అమ్మాయి ఎవరు?

మా ఇంటి దగ్గరే ఆ అమ్మాయి ఇల్లు కూడా, కాకపోతే ఇన్నాళ్లు అంత అబ్సర్వ్ చేయలేదు, స్కూల్ అయినా , ఇంటర్ అయినా చదివేటప్పుడు అమ్మాయిలు చదువుల బిజీ లలో కనిపించరుగా, ఆలా నాకు కనిపించలేదు చిన్నప్పుడు పొట్టి పొట్టి ఫ్రొక్ లు వేసుకొని నా ముందే తిరిగేది కానీ అప్పుడు ఆలా అనిపించలేదు, ఈ మధ్యనే నేను మార్నింగ్ రన్నింగ్ కి వెళ్లి వస్తుంటే, ఎవరో అమ్మాయి గట్టిగ నవ్వుతు సైకిల్ తొక్కుతూ వెళ్తుంది, ఆ నవ్వు విన్న ఆ అమ్మాయిన్ని చూడాలనుకున్న, వైట్ డ్రెస్ లో సైకిల్ తొక్కుతూ నవ్వుతు, తన ఫ్రెండ్ ని ఏదో ఏడిపిస్తూ వెళ్తుంది. పక్కన ఎవరు ఉన్న, ఎలా ఉన్న, ఎం జరుగుతున్న తనకి కానట్టు , నవ్వుతు వెళ్లిపోతుంది. చూసా ఏదో కల ఆ అమ్మాయిలో, ఇంకా ఎప్పుడు వాగుడుకాయి ల వాగుతూనే ఉంటది. కానీ తన అమాయకత్వం, చిలిపితనం, ఇంకేమో అట్ట్రాక్ట్ అయ్యా తనకి. ప్రపంచం మొత్తం బాధలో ఉన్న తన నవ్వుతో అందరిని మార్చేస్తుంది.

మధు ఇంకా ఆపర నాకైతే అంతగా ఏమి అనిపించలే, ఇంతకీ ఎం చదువుతుంది ఏ కాలేజీ తెలుసా?తెలుసురా , డైలీ తనని ఫాలో చేస్తున్న, తను కనిపించేటప్పుడు ఒక పాట కూడా పాడుతా, నన్ను క్రాస్ చేసి వెళ్లేప్పుడు, కానీ తాను న వైపు ఒకసారి కూడా చూడలేదు ఆ పాటని కూడా వినలేదు చెప్పా గ వాగుడుకాయి అని ఆ వాగుడు లోన పాట వినిపించలేదు. మధు ఎం చేస్తావు రా ఎప్పుడు చెప్పు, తనతో మాట్లాడుతావా ? లేక పర్సనల్ గా ఎక్కడైనా కలిసేలా చేయమంటావా చెప్పు ? అంత నచ్చింది అంటున్నావు గా? లేదు రా వినయ్ , నువ్వు ఆగు! ఎం చేయకు , నాకు లవ్ అనే అభిప్రయంలేదు.

మరి లవ్ లేదు అంటే ఏంటి రా, జస్ట్ అట్రాక్షన్ అంతే రా, చూడాలనిపిస్తుంది తాను నవ్వుతుంటే, వినాలనిపిస్తుంది తాను మాట్లాడుతుంటే, వినయ్ తాను ఏదో ఇన్స్టిట్యూట్ కి వెళ్తుంది రా, బట్ నేను జాబ్ కి వెళ్లిపోతున్నా కదా, ఈవెనింగ్ టైం లో కుదరదు, మార్నింగ్ టైం కాలేజీ కి వెళ్లే టైంలోనే చూస్తున్న, వినయ్ ఓ పని చెయ్ రా, తాను ఈవెనింగ్ ఏ ఇన్స్టిట్యూట్ కో వెళ్తుంది కనుక్కో, నేను ఆఫీస్ త్వరగా ముగించుకొని ట్రై చేస్తా , నేను కూడా జాయిన్ అవ్వటానికి. మధు నువ్వు ఇన్ని చెప్తున్నావ్, తనని అంతలా వర్ణిస్తున్నావ్, చూడాలని ఉంది అంటున్నవ్, ఇవి అన్ని ప్రేమ అనేగా అంటారు. మరి లవ్ లేదు అట్రాక్షన్ అంటావేంటిరా? ఏమోరా వినయ్ నువ్ కనుక్కో , తన పేరేంటి ఇంతకీ ? “సింధు” రా, హ పేర్లు కలిసాయి సింధు, మధు, అయినా ఒక్కరోజు కూడా సింధు నేను ఫాలో అవుతున్న అని కూడా గుర్తించలేదుగా, నన్ను చూడలేదు కూడా, తన పని తాను చేసుకుపోతాది, నేను ఆ పిల్ల కి సైట్ కొడుతున్నట్టు కూడా సింధుకి తెలీదు, జడ్డి మాలోకం, సింధు పక్కనే ఇంకో అమ్మాయి ఉంటది రోజు తాను చూస్తుంది నన్ను, సింధు కనిపించేటప్పుడు హాయ్ చెప్బ్దమని కూడా ట్రై చేస్తా, పొరపాటున ఆసింధు పక్కన ఉన్న ఇంకో అమ్మాయి చూసి దానికి అనుకుంటాడేమో అని భయం, ఏంటో ఈ అమ్మాయిలు, సరేరా మధు ఈవెనింగ్ కి నేను చెప్తా,సరే రా వినయ్ ఈవెనింగ్ నాకు చెప్పు ఏదో ఒక విషయం.

మర్నాడు పొద్దున్నే మల్లి రన్నింగ్ కి వెళ్లిన మధు, కానీ సింధు కి ఈసారి తన సైకిల్ టైర్ లో తాను వేసుకున్న గాగ్రా వెళ్లిపోయింది. ఇంతలో మధు వచ్చి చూసి తన గాగ్రా ని తీసాడు, థాంక్స్ అని చెప్పింది. కానీ డ్రెస్ చిరిగిపోయింది ఇంకా కాలేజీ కి ఏ వెళ్తారు అని మాటలు కలిపాడు మధు, కానీ తాను ఏడుస్తూ నాకు నచ్చిన డ్రెస్ ఎలా చిరిగిపోయింది అంటూ ఇంటికి వెళ్లిపోతుంటే, ఈసారి మాటలు కలిపాడు మీ పేరేంటి? ఫస్ట్ టైం మిమ్మల్ని ఏడవటం చూసి, అయినా మీరు కూడా ఏడుస్తార? సింధు అదేం ప్రశ్న నేను అమ్మాయినిగా, అవును సింధు ఎప్పుడు నవ్వుతు ఉంటావు, కష్టాలు తేలినట్టు, కష్టాలు లేనట్టు, ిన అంత గటిఇగ రోడ్ మీద అరుస్తూ, నవ్వుతు, మాట్లాడుతూ రోజు వెళ్తావ్? ఎందుకు అంత గట్టిగ అరుస్తావ్..

నా ఇష్టం, నా నోరు నువ్వు ఎవరు అడగటానికి? సరే ఇలా నాతో పాటు రావద్దు, అంటూ వెళిపోయిది. రోజు తనని చూడట హాయ్ చెప్పడం.మనసారా మాట్లాడటం, ఇంటికి వెళ్లిపోవటం, తాను ఎలా ఉండాలో చెప్పటం, సింధు, మధు చాల మంచి స్నేహితులు అయ్యారు, ఫోన్ నంబర్స్ తీసుకొని మెస్సగెస్ కూడా చేసేవారు. సింధు కూడా తనక న్నా పెద్ద కదా ఏ నిర్ణయం ిన తీసుకునేముందు మధు కి అడిగేది? మధు రైట్ ఓర రాంగ్ అని చెప్పేవాడు. సింధు కి ఒక మంచి స్నేహితుడు దొరికాడు అని మురిసిపోయేది, కానీ మధు తన మనసులో ఇష్టం ఉన్న, మధు ఎప్పుడు సింధు కే చెప్పలేదు. దూరంగా ఉంది ఫ్రెండ్ లా మంచి చెడ్డలు చెప్పడం లోనే ఉన్నాడు, ఎందుకంటే సింధు ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాడు, తనకి చిన్నప్పుడే వాళ్ళ మావయ్య కి ఇఛ్చి పెళ్లి చేస్తారని అనుకున్నారని డిగ్రీ ఇయ్యక తనకి పెళ్లి అని , ఇంకా మధు ఒక మంచి ఫ్రెండ్ లా , గుడ్ ఏదో బాడ్ ఏదో సలహాలు ఇస్తూ చిరకాలం మంచి స్నేహితుల గ ఉండిపోయారు, కానీ తనకి ఎప్పుడు తన మనసులో మాటని కానీ అట్రాక్షన్ ని ప్రేమ లా పెంచుకొని ఇంకేదో ట్రై చేయటం కానీ చేయలేదు. ఇలాంటి ప్రేమలు చిగురించకుండానే భూమిలో నే ఒదిగిపోతాయ్. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటె నాతో పంచుకోగలరు.

info@kathaluvyadalu.com