1 వెన్నెల రాత్రి లో ఆకాష్, రచన | love stories in telugu | telugu stories

వెన్నెల రాత్రి లో ఆకాష్, రచన..

అది ఒక వెన్నెల రాత్రి దూరంగా  కనబడుతున్న తెల్లని నురుగుతో ఆకాశాన్ని అంటేలా కన్పడుతున్న సముద్రపు అలలు తీరాన్ని తాకుతూ ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా ఉంది, అనుకుంటూ, ఈ హోటల్ విండో లోంచి ఆ సముద్రాన్ని చూస్తున్న నాకు దగ్గరగా చూడాలని ఉంది. అరేయ్ శీను నేను బీచ్ కి వెళ్తున్న నువ్వు కూడా వస్తావా? ఆకాష్ ఇప్పుడు టైం రాత్రి 10:30 అయ్యింది. రేపు తెల్లవారేసరికి మనకి మీటింగ్ ఉంది. నువ్వు ఇప్పుడు బీచ్ కి వెళ్తే అప్పుడే రావు, నిద్ర సరిగా ఉండకపోతే నువ్ ప్రాజెక్ట్ ప్రెసెంటేషన్ ఎలా ఇస్తావ్ రా? పడుకోరా ఆకాష్ ప్లీజ్! లేదురా శీను ఆ హైద్రాబాద్ లో ఉరుకులు పరుగుల జీవితం. ఎప్పుడు వర్క్ ప్రెషర్ తో ఉంటాం.  వైజాగ్ రావడం తో నాకు అవకాశం వచ్చిందిరా  శీను. ఎప్పటినుంచో బీచ్ ని దగ్గరగా చూడాలని నా కోరిక, పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే చదువు ఉద్యోగం కూడా హైదరాబాద్ లోనే, సాయంత్రం 6 నుంచి ప్రాజెక్ట్ పని కదా రా , నీలా తాగే అలవాటు నాకు లేదు, రిలాక్సేషన్ కావాలంటే ఆలా చల్ల గాలికి తిరగలి, నన్ను వెళ్లనీరా ఆపకు, సరేలేరా తొందరగా వచ్చేయ్ అంటూ శీను చెప్పాడు.  

ఆకాష్ ఇంకా బయలుదేరాడు, అబ్బా బీచ్ దగ్గరకు వెళ్ళబోతున్న అనే ఉత్సాహంతో, అసలు ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళు ఉండే హోటల్ విండో లోంచి సాయంత్రం 6 నుంచి చూస్తున్నాడు. ఎవరో ఒక అమ్మాయి బెంచ్ ఫై నుంచి కదలకుండా అక్కడే కూర్చొని ఉండిపోయింది, వర్క్ ప్రెషర్ కి పడుకోవాలని ఉన్న, సముద్రం ఎంత అందంగా  కనిపిస్తుంది, ఆ చల్ల గాలిని సముద్రాన్ని చూడచ్చు అలాగే ఆ అమ్మాయిని కూడా చూడాలి దానితో పాటు రాత్రి వేళా ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో పెద్ద జుట్టు తో చూస్తూ, మనసులో మొదట్లో ఎవరి గురించో వెయిట్ చేస్తుందేమో అనుకున్న కానీ రాత్రి అయినా  తాను ఇంటికి వెళ్లకపోవడమేంటి ? ఏమైనా ప్రాబ్లెమ్ లో ఉందేమో అనుకుంటూ అక్కడికి వెళ్లే లోపు ఆ అమ్మాయి బెంచ్ మీద కనిపించడం లేదు. ఆకాష్ చుట్టూ చూసాడు దూరంగ సముద్రం లోకి వెళ్లిపోతూ ఒక అమ్మాయి, వైట్ డ్రెస్లోనే ఉంది, ఇంకా ఆకాష్ పరుగు అందుకున్నాడు. ఆ అమ్మాయిని కాపాడాలని ఇంతలో ఆ అమ్మాయి వెళ్లిపోతుంది కానీ ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. మొత్తానికి కాపాడేసాడు. ఆ అమ్మాయి నన్ను వదలండి నన్ను చచ్చిపోనీయండి, , అంటూ ఏడుస్తూ

నా పేరు ఆకాష్ , మాది హైదరాబాద్, ఆఫీస్ వర్క్ మీద వైజాగ్ వచ్చా, ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నా, నెలకి లక్ష రూపాయిల జీతం, మరి  మీ పేరేంటి? ఎందుకు చనిపోవాలనుకున్నారు? నా పేరు రచన మేము ఉండేది మధురవాడలో, ఓకే ఏమైనా తింటారా ? లేదు మీరు వెళ్లిపోండి నేను చచ్చిపోతా, రచన గారు మీకేమైనా పిచ్చ అసలు మీ ప్రాబ్లెమ్ ఏంటి? ఇంత అందంగ ఉన్నారు. చదువుకున్నట్టు ఉన్నారు. ప్రాబ్లెమ్ అందరికి ఉంటాయి. చావు ఒక్కటే పరిస్కారం కాదు. ఏమైంది ముందు చెప్పండి. ముందు ఏమైనా తిందురు రండి నాతో పాటు, ఆ అమ్మాయి నడుస్తూనే కథను అందుకుంది. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న. ఓహ్ గుడ్ అండి. క్యాంపస్ లో జాబ్ రాలేదా? అందుకే చనిపోవాలి అనుకున్నారా? కాదు. ఇంట్లో మీ లవ్ ని ఒప్పుకోలేదా అందుకే ఇలా వచ్చారా? కాదు అంది. మరి?  చెప్పండి ఐతే.  మాది ఆనంద్ నగర్ కాలనీ, మా అపార్ట్మెంట్ లో మొత్తం నలుగురం అమ్మాయిలం. చిన్నప్పటి నుండి ఒకటే స్కూలు, కాలేజీ, అలాగే మా నాన్న వాళ్ళు కూడా ఒకటే ఆఫీస్ లో పని చేస్తున్నారు. మేమంతా ఫామిలీ ఫ్రెండ్స్. సరే అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, మీరేం తింటారు, ఆకలిగా ఉన్నారుగ బిర్యానీ ఓకే నా రచన గారు? నో ఇడ్లీ చాలు ఆకాష్ గారు సరే మీరు చెప్పండి అంటూ ఇడ్లీ ని తెస్తాడు ఆకాష్ , మా నలుగురిలో నేనే బాగా చదువుతా , కొంచెం వాళ్ళ కన్నా అందంగా  కూడా ఉంటాను , ఇంతలో ఆకాష్ వాళ్ళ అందరిని  చుస్తేగా  తెలుస్తది మీరు బాగుంటారో వాళ్ళు బాగుంటారో చెప్పేది అంటూ జోక్ వేస్తాడు. నేను ఇలా అయితే చెప్పను అంటూ ఆ అమ్మాయి లేచి వెళ్ళిపోతుంది.

సారీ రచానా గారు మిమ్మల్ని నవ్విధం అని ఇలా అన్న. చెప్పండి ప్లీజ్ ఐతే ఇంతకీ ఏమైంది చెప్పండి, మా ఫ్రెండ్స్ అందరికి లవర్ ఉన్నారు, రాజి  వాళ్ళ బావ తో లవ్ లో ఉంది, కుసుమ మా పక్క ఫ్లాట్ అబ్బాయ్ తో, లల్లి మా కాలేజీ అబ్బాయితో, నేను మాత్రం లవ్ లు నమ్మను. ఇంట్లో తల్లి తండ్రులకి తెలుసు మనకి ఎం కావాలో ఎప్పుడు ఎం చేయాలో తెలుసు అనే నమ్మకం తో నేను ఎవరని ఇష్ట పడేలేదు,  మేమంతా కాలేజీ అయినా, షాపింగ్ ఆయిన్, సినిమా అయినా కలిసే వెళ్ళేవాళ్ళం. కానీ వాళ్లంతా వాళ్ళ లవర్స్ లో బిజీ ఐపోయారు. పార్టీ లు లవర్స్ తో కలిసి పార్క్ లు సీనియా లు ఇలా. అందరు ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ,  లవర్స్ తో తిరుగుతున్నారు. నేను కాలేజీ అవ్వగానే ఇంటికి రావడం, చదువుకోవడం నిద్ర పోవడం తప్ప ఎం తేలేదు. ఇంతలో ఆకాష్ మంచి పెద్దతేగా ఈ  రోజుల్లో ఎవరు అలాంటి అమ్మాయిలు లేరుగా రచన గారు, ఐన ప్రాబ్లెమ్ ఏంటి ఇప్పుడు.  మీలాగే అన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటిలో వాళ్ళ లవ్ గురించి తెలిసి పోయింది, వాళ్ళ పేరెంట్స్ అంతా నన్ను పొగిడారు. సో నాతో మాట్లాడటం మానేశారు మా ఫ్రెండ్స్ కానీ ఈ  గ్యాప్ లో మా లెక్చరర్ నన్ను ఇష్టపడటం స్టార్ట్ చేసారు, నాకు ఇష్టం లేదు అని చెప్పేశా. కానీ రోజు వెంట పడేవారు, పెళ్లి చేసుకుంటా అని, మా ఇంట్లో ఒప్పుకోరు అని ఎంత చెప్పిన వినిపించుకునే వారు కాదు.

 ఇంతలో ఒక రోజు కాలేజీ ఫెస్ట్ అయింది, నేను ఆరోజు రెడ్ కలర్ లంగా వోణి వేసుకొని చాల అందంగ తయారయ్యా, మా లెక్చరర్ నా వెనుక పడుతూ ఈరోజు నిన్ను ఎలా అయినా నాదాన్ని చేసుకుంటా అనేసి వెళ్లిపోయారు, మా ఫ్రెండ్స్ అతనికి హెల్ప్ చేయటం తో ఏడుస్తూ ఆరోజు నేను తాగే డ్రింక్ లో మత్తు మందు కలిపేశారు. నేను ఆ మత్తులో ఉండగా ఏడుస్తూ మా లెక్చరర్ నన్ను పాడుచేశారు. ఈ  విషయం కాలేజీ అంత తెలిసిపోయేలా చేసారు. దిక్కు లేక నేను అతనిని పెళ్లి చేసుకుంటా అనే ఉద్దేశంతో. కానీ మా డాడీ ఇది తెలిసి పరువు పోయింది అంటూ నన్ను కొట్టారు. అందరికి తెలిసి పోవటంతో అంత నన్ను చెడిపోయిన అమ్మాయిల చూస్తున్నారు. నన్ను, ఇంట్లో వాళ్ళని చాలా మాటలు అంటున్నారు. ఇంతలో మా లెక్చరర్ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనే చెప్పటం తో పరువు అని, సంప్రదాయం అని నన్ను మా లెక్చరర్ తో పెళ్లి చేయటానికి ఇంట్లో రెడీ అయ్యారు. మా ఫ్రెండ్స్ అంత వాళ్ళ లవర్స్ తో ఎప్పుడో హద్దులు దాటారు. కానీ నేను నా పద్దతి లో ఉన్న, బలవంతంగ జరిగిన దానికి నేనేమి చేస్తా, మా లెక్చరర్ అంటే నాకు ఇష్టం లేదు, అందుకే చనిపోవాలనుకుంటున్న. అంటూ మల్లి ఏడుస్తూ నా  ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనెలా బాధ్యత ఆవుతా?

రచన గారు చాల సారీ అండి మీకు జరిగిన దానికి, నిజమే ఒక గౌరవమైన, మధ్య తరతి లో పుట్టిన ప్రతి ఒక్కరు ఇలానే ఆలోచిస్తారు. అని చెప్తూ నిజమే మీ తప్పు లేదు, ఎవడో వెదవ చేసిన పనికి మీరెందుకు బాలి అవ్వాలి అంటూ, మేక్ అభ్యన్తరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆకాష్. రచన ఒక్కసారిగా నా గురించి తెలిసే అన్నారా? తెలివిమీదనే అన్నారా అంటూ అడిగింది.

ఆకాష్ తనని ఓదారిస్తూ, రచన గారు మీకో విషయం చెప్తా, ఇప్పటి అమ్మాయిలలో ఎవరు తిన్నగా ఉన్నారని నమ్మకం లేదు. అంత ఎందుకు మీకున్న ఫ్రెండ్స్ లో అందరికి పెళ్లి కాకా ముందే హద్దులు దాటారని చెప్తున్నారు, నేను మీమీద జాలి తోనో లేక ఇంకేదో అనుకోని ఈ నిర్ణయం తీసుకోలేదు. మీరు నాకు నచ్చారు, మీ కదా విన్న తరువాత మీరెంత పద్దతిగా పెరిగారో విన్న, మీ అమాయకత్వం చూసా, అన్ని చూసాక నిర్ణయం తీసుకున్న. నా గురించి ముందే చెప్పాగ నాకు ఎటువంటి అలవాట్లు లేవు, కాస్తో కూస్తో గడిస్తున్న, మిమ్మల్ని బాగా చూసుకుంటా, నన్ను నమ్మండి, అంటూ మా అడ్రస్, నా ఆఫీస్ డీటెయిల్స్ నా గురించి పూర్తిగ ఆరా తీసాకనే నన్ను పెళ్లి చేసుకోండి. అంటూ రచన ఇంటి దగ్గర దింపి వాళ్ళ నాన్నగారికి తనని పరిచయం చేసుకొని తన మనసులో మాటని చెప్తూ విసిటింగ్ కార్డ్స్ కూడా ఇఛ్చి తన గురించి కనుక్కున్నాక గుడ్ న్యూస్ చెప్తారని వెళ్తున్న అని అక్కడ నుండి బయలుదేరుతాడు.

నోట్: మంచి వాళ్ళకి అన్యాయం జరిగిన ఎప్పటికైనా మంచే జరుగుతాది