మంగళ్ పాండే

మంగళ్ పాండే బ్రిటిష్ వారిపై తిరుగుబాటును ప్రకటించిన  ప్రప్రథమ స్వాతంత్ర సమర యోధుడు. మంగళ్ పాండే  19 జులై 1827 న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములో బాలియా జిల్లా లో నిగ్వ అనే కుగ్రామంలో  బ్రాహ్మణా కుటుంభం లో పుట్టారు. మరియు అతని 18 వ ఏట నే మిలిటరీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లో జాయిన్ అయ్యారు. మరియు 1849 లో 34 వ రెజిమెంట్ నందు బెంగాల్ లో ఒక సిపాయిగ చేసేవారు. కానీ అప్పటికే మన భారత దేశం పై బ్రిటిష్ వారి పరిపాలన రెండు శతాబ్దాలుగా సాగుతుంది. వర్తకం గురించి వచ్చిన బ్రిటిష్ వారు మన భారత దేశాన్ని ఆక్రమణ చేసుకున్నారు, రాజుల పాలనలో శత్రు రాజ్యాలకు మిత్ర రాజ్యాలకు శత్రుత్వానికి మరింత ఆద్యం పోసి రాజ్యాలను చేజిక్కించుకున్నారు, మరియు రాజులను వారి ఆధీనం లో తెచ్చుకొని ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమణ చేసి మొత్తం దేశం అంతటా వారి పాలనా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు దేనితో రాజులంతా వారి దగ్గర పరిచారికలుగా మారారు. బ్రిటిష్ వారు పెట్టిన విధానాలను వ్యతిరేకుంచకుండా అవలంభన చేయటం వారికీ మరింత బలం చేకూరింది. కానీ భారతీయ ప్రజలను బానిసలుగా మార్చి హింసలకు గురి చేసేవారు. భారతీయుల మంచి తనాన్ని అమాయకత్వాన్ని చూసి మన భారతీయులపై అమానుషత్వాన్ని ప్రదర్శించేవారు . కానీ భారతీయులు తిరుగుబాటుకు ప్రయత్నించటానికి కూడా బ్రిటిష్ వారి దగ్గర ఉన్న ఆధునిక యంత్రాలు మరియు సైన్యం ని చూసి వెనక్కి తగ్గేవారు.ఇదిలా ఉండగా బ్రిటిష్ వారి పూర్తి ఆధీనం లో ఉన్న భారతీయ ప్రజలకు కఠినమైన భూమి శిస్తులు, భూ స్వాములు జమీందార్ల అకృత్యాలు , బ్రిటిష్ వారి విస్తార విధానాలు, ఆర్ధిక దోపిడికి మరియు పరిపాలన సంస్కరణలను భారతీయ ప్రజల గౌరవం కు మరియి బానిసత్వాన్ని ప్రతీకగ మారాయి. ఎన్నో అవమానాలను, ఇబ్బందిలను భరించేవారు.

మంగళ్ పాండే మొదటి నుండి భారతీయుల పై జరిగే అవకతవకలను , వివక్షతను తీవ్రం గా కండించేవారు. ఐతే 1848 లో  లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం తీవ్ర స్థాయిలో ఆవేశానికి గురి చేసాయి. మొఘలులను వారి వారసత్వ స్థలం నుంచి కుతుబ్ కు తరలిపొమ్మనటం ప్రజా ఆగ్రహానికి గురి అయ్యాయి. తిరుగుబాటుకు ముఖ్య కారణం పి/53 అన్ ఫీల్డ్ రైఫిల్, 557 క్యాలిబర్ రైఫిల్ లో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయిలు ఏ తూటాలను నోటితో ఒలిచి, రీఫిల్ లో నింపాల్సి రావటం తో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడటానికి ఒప్పుకోలేదు. హిందూ సిపాయిలు ఆవు కొవ్వు తో తయారు చేసే తూటాలను, ముస్లిం సిపాయిలు పంది కొవ్వుతో తయారు చేసే తూటాలను వాడటానికి నిరాకరించారు. ఆ తూటాలను మార్చమని కొవ్వులను తేనే పట్టు నుండి లేదా నూనె గింజలనుండి సొంతం తరరు చేసుకోవడాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ సిపాయలకు నమ్మకం కలింగించలేదు. దీనితొ సిపాయిలలో తీవ్ర తిరుగుబాటు తత్వం కలగడం తో ఉద్యమం ప్రారంభించారు. తిరుగుబాటు ఉద్యమానికి మంగళ్ పాండే నాయకత్వం వహించారు. దీనితో బారాయుల తిరుగుబాటును సహించలేని బ్రిటిష్ వారు కొత్త విధానాలను అమలులోకి తెచ్చారు.  ఏ తిరుగు బాటుకు కారణం అయినా   తూటాలకు సిపాయిలే కొవ్వులను పూయాలని ఆదేశించారు.భారతీయుల వీరత్వాన్ని, బలంను  మరియు తెగువని బ్రిటిష్ వారికీ తెలియచేయడానికి మంగళ్ పాండే ఒక బ్రిటిష్ సార్జెంట్ ను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగానే లెఫ్టినెంట్ భాగ్ పై కాల్పులు జరిపారు. కానీ అది గురి తప్పగా అతని ప్రాణాలను చేతిలో పట్టుకొని పరుగులు తీశారు. కానీ అతని సహాయకునికి గాయాలు చేసారు. జనరల్ హెన్రీ మంగళ్ పాండే ను మాత పిచ్చి పట్టిన వాణిగ పరిగణించి అతడిని బంధించమని ఈశ్వరి ప్రసాద్ అనే జమిందారును ఆగ్నేపించగా జమీందారు తిరస్కరించారు. షేక్ పాల్టు అనే అతడు తప్పించి అక్కడ ఉన్న సిపాయిలు కూడా మంగళ్ పాండే అరెస్ట్ కు తిరస్కరించారు. కానీ షేక్ పాల్టు మంగళ్ పాండే ని బంధించి బ్రిటిష్ వారికీ అప్పగించారు. దానికి గాను షేక్ పాల్టు కి పదోన్నతిని ఇచ్చారు.   బ్రిటిష్ వారి పరిపాలనలో వారిపై కాల్పులు చేయటం ఎంతో సాహసం కావాలి. మన మంగళ్ పాండే  ధైర్యం చేసారు. మన దేశం ఫై ఎవరో ఆధిపత్యం ఉండకూడదని స్వాతంత్రంగ ఉండాలని, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని ఉద్యమాన్ని లేవనెత్తి  భారతీయ ప్రజలకు అవగాహనా కల్పించారు. ఈ ఉద్యమం ఢిల్లీ మరియు ఉత్తర భారత దేశం మరియు మీరట్, లక్నో ఇంకా భారత దేశం అంతా వ్యాపించింది. దీనితో ఆగ్రహానికి గురి అయిన బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమానికి నాయకుడు అయినా మంగళ్ పాండే ను ఉరి తీయాలని నిర్ణయించారు. మరియు విచారణలో భాగం గ కోర్ట్ లో నీతో పాటు ఉద్యమం లో పాల్గొన్న వారి పేర్లను చెప్పమని కోరగా మంగళ్ పాండే  మౌనం వహించారు. ఏప్రిల్ 7 న 1857 లో మంగళ్ పాండే  ను ఎక్కడ ఐతే బ్రిటిష్ సార్జెంట్ ఫై కాల్పులు జరిపారో అక్కడే ఉరి తీయాలని ఆమోదం తెల్పింది. ఏప్రిల్ 7  న కొలకత్తా లో భారకపూర్ లో ఉరితీశారు. కానీ అతని ఆశయాలు దేశమంతటా విస్తరించారు. ఏప్రిల్ 22 న జమీందారు ను ఉరి తీశారు. కాగా ఢిల్లీ లో మరియు వివిధ ప్రదేశాలలో తిరుగుబాటును ఉపక్రమించకుండా ఘాన్సీ లక్ష్మీబాయి మరియు, నానా  సాహిబ్ భగత్ ఖాన్, బిర్జిస్కాద్రా మరియు నవాబ్ అఫ్ ఒద్ధ్ ఉద్యమాన్ని కొనసాగించారు.