ప్రేమ /ఆకర్షణ

శృతి లే టైం అవుతుంది. ఈరోజు ఏదో ప్రైవేట్ క్లాస్ అన్నావ్ గా అంటూ అరుస్తున్న అమ్మ మాటలు స్పష్టం గా వినిపిస్తున్నాయి. శృతి లేస్తూనే చి ఈ ఇంటర్ లో జాయిన్ ఐనప్పటి నుంచి నిద్ర లేదు, ఎంసెట్, జె ఈ ఈ వారానికో టెస్ట్ అంటూ బుర్ర తినేస్తున్నారు. పాలిటెక్నిక్ లో అయినా జాయిన్ అయ్యాను కాను అంటూ లేచిన శృతి, వెంటనే అమ్మ వచ్చి కష్టపడాల్సిన టైం లోన, చదవాల్సిన టైం లోన చదివితేనే! లేదంటే జీవితం మొత్తం ఆ టైం లో చదవలేదే అంటూ బాధపడి ఏ చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చిన జీతాలు చాలక ,ఎన్నో ఆశలు ఉన్న తీర్చుకోడానికి మనీ లేక ఇబ్బందులు పడాలి అమ్మ., చదువుకో అంటూ శృతికి జడ వేస్తూ చెప్పిన మాటలు. సరేలే అమ్మ అంటూ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి కాలేజి బయల్దేరింది వెళ్తుంది.

నిద్ర తీరని శృతికి ఇంకా కాలేజీ కి వెళ్తూనే సండే రోజు టీం ని డివైడ్ చేసి చదవడానికి మెటీరియల్ లేచి కంప్లీట్ చేసి బై హార్డ్ చేసి వెళ్లాలని చెప్పారు. సరే అంటూ వాళ్ళ సర్ ని తిట్టుకుంటూ చదువుతుంది. ఇంతలో ముందుగానే చదివేసి న ఫ్రెండ్స్ అంత కాలక్షేపం చేస్తున్నారు. ఆరోజు సండే కావటం మరియు, హాలిడేస్ ఇవ్వటం తో సీనియర్స్ కి కానీ , లేదా జూనియర్స్ వీక్లీ టెస్ట్స్ కానీ లేవు. కాలేజీ కూడా చాల ప్రశాంత గ ఉంది. లాస్ట్ వీక్ టెస్ట్ లో తక్కువ మర్క్స్ వచ్చాయి.
ఆ రోజు వాళ్ళ క్లాస్ లో అబ్బాయ్ తనతో చనువుగా మాట్లాడుతూ తన గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు, తన ఫామిలీ గురించి అన్న తమ్ముల గురించి, అలానే ఆ అబ్బాయ్ సుందర్ గురించి కూడా అన్ని విషయాలు తెలుసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. చాలా తక్కువ మందే కాలేజీ కి రావటం చాల ఎక్కువసేపు మాట్లాడుకోగలిగారు. ఇంతలో అటుగా వచ్చిన సర్ కి తాను చదివేసిన ప్రశ్నలు అన్ని సమాదానాలు చెప్పి ఇంటికి వెళ్లిపోయింది.

మరుసటి రోజు కాలేజీ లో సుందర్ ని చూసి హాయ్ అని నవ్వింది. అటు నుంచి కూడా సుందర్ కూడా హాయ్ అని చెప్పాడు. రోజు మాట్లాడుకోడాలు, బాక్స్ షేరింగ్ లు,బర్త్ డే గిఫ్ట్స్, కంబైన్డ్ స్టడీస్ ఇలా ఒకరి ఇంటికి మరొకరు వెళ్ళటాలు ఎలా రోజులు గడుస్తున్నాయి. ఇంకేముంది క్లాస్ లో గుసగుసలు సుందర్, మన కీర్తి లవర్స్ అని, కానీ వాళ్ళిద్దరికి లైన్ ఆలోచనకు బాధపడ్డారు. ఇంకా కీర్తి సుందర్ తో మాట్లాడటం తగ్గించినది.కానీ ఇదంతా నార్మల్ గ తీసుకోలేని సుందర్, కీర్తి స్నేహాన్ని మరవలెనని కీర్తి లేకుంటే తన లైఫ్ లో ఏదో మిస్ అవుతున్నాడు అని అర్ధం చేసుకొని, ఇదంతా కీర్తి కి చెప్పాలని కారిడార్ లో వెయిట్ చేస్తూ, కీర్తి కి ఏ విషయం అందరితోనే చెప్తాడు, అంతే కాకా వరుసగా వచ్చిన ప్రేమ సినిమా ప్రభావం అంత పడి కీర్తి మీద తనకి స్నేహం కాదని ప్రేమ అని తెలుసుకొని కీర్తి కి మరుసటి రోజు నే ప్రేమని వ్యక్తపరుస్తాడు.

కీర్తి ,సుందర్ ప్రేమ ని ఒప్పుకుంటుంది. ఇంకా ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరగడం, ప్రేమకు అర్ధం వల్లే అన్నట్టు ఫీల్ ఐపోయి తిరిగేయటం మొదలు పెట్టారు. దానికి తోడు లవ్ సినిమాలు చూస్తూ ప్రేమికులు ఎలా ఉండాలో ఎలా ఫీల్ అవుతారో తెలుసుకొని మరి జీవితాన్ని హ్యాపీ గ గడిపేస్తూ, ప్రతి రోజు కాలేజీ కి క్లాస్ లు కన్నా వాళ్ళు కలుసుకోవటానికే అన్నట్టుగ మునిగిపోయారు, చదువులు పక్కన పెట్టారు. కానీ సుందర్, కీర్తి ప్రేమలో పడి తన చదువుని పక్కన పెట్టడం గమనించిన వాళ్ళ ప్రిన్సిపాల్ సుందర్ ని కీర్తి ని పిలిపించి వాళ్ళ భవిష్యత్తు గురించి అర్ధం అయ్యేలా చెప్పి పంపిస్తారు. ప్రిన్సిపాల్ సర్ కీర్తి ని సురేష్ ని పిలిచి ఆకర్షణకు ప్రేమ కు తేడా చెప్పి పంపిస్తారు.. దానితో కీర్తి అమ్మ నాన్నలకు ఇచ్చిన మాటను వాళ్ళ పరువుని నిలబెట్టాలని చదవటం స్టార్ట్ చేసినది. ఐనా అర్ధం కానీ సుందర్ కీర్తి ప్రేమలో పిచోడిల కీర్తి వెనుకే పడుతూ తిరగటం తో నీ షరతులతో తాను బాగా చదువుకోవాలని, ఎగ్జామ్స్ లో 900 అబొవె మర్క్స్ రావాలని చెప్తుంది. సరే అని సుందర్ కూడా మొదలై పెట్టాడు చదవటం ఫైనల్ ఎగ్జామ్స్ చదవటం లో పది కీర్తి ని మర్చిపోతాడు, కీర్తి ఎత్తిన టార్గెట్ ని మాత్రమే గుర్తుపెట్టుకొని చదివి 930 మార్క్స్ తెచ్చుకున్నాడు. కీర్తి తన దగ్గరకు వెళ్లి కంగ్రాట్స్ చెప్తుంది. ఇదంతా వాళ్ళ మధ్య లవ్ కాదని అట్రాక్షన్ అని తెలుసుకొని ఫాథర్ స్టడీస్ మీద ద్రుష్టి పెడతారు.