పెద్దరికం

ఏమండి మీ అన్నయ్య చెప్పిన తీరు నాకు నచ్చలేదు.. ఐనా పిల్లలు అన్నాక కొట్టుకోవడం మానేస్తారా, తిట్టుకోవడం మానేస్తారా? ఆ మాత్రం దానికే ఇంట్లో నుంచే వెళ్లిపోవడం ఏంటి? అబ్బా శ్రీలత నీ నస ఏంటే? పొద్దున్న తెల్లవారితే నేను ఆఫీస్ కి వెళ్ళాలి మీటింగ్ ఉంది. ఐనా అన్ని గొడవలు నీకెందుకు అమ్మ నాన్న చూసుకుంటారు వాడికి నచ్చ చెప్తారు లే. నువ్వు నన్ను ఇప్పటికి పడుకొని అంటూ అటు తిరిగి పడుకుంటాడు శేషు. ఏంటో ఇతనికి ఇల్లే పట్టదు. ఎప్పుడు ఉద్యోగమే, పొద్దున్నే వెళ్తారు మల్లి రాత్రి 9 అయినా ఇల్లు గాని పెళ్ళాం గాని గుర్తుకురాదు. ఆ పాటి దానికి పెళ్లి ఎందుకు చేసుకున్నట్టో ఆఫీస్ లోనే ఉండిపోవచ్చు గ ఇంటికి రావడం ఎందుకు.. విసుక్కుంటూ పడుకుంటుంది.

అది సీతారామయ్య గారి ఇల్లు, ఆయన భార్య జానకి వారికీ ఇద్దరు కొడుకులు ఒక కూతురు, కూతురు చిన్నది, కలెక్టరేట్ లో క్లర్క్ గా చేసి రిటైర్డ్ అయ్యారు. చాలా మంచి వారు, నెమ్మదస్తులు, జానకమ్మ ఇంకా పూజలు దేముళ్ళు ,నా పిల్లలు, నా ఇల్లు అనుకోని యాతన, ఆ కాలనీ లో సీత రామయ్య గారంటే మంచి అభిమానం. పిల్లలని అదుపు తప్పకుండ మాంఛి నడవడిక తో పెంచారని, అబ్బాయిలు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోయినా ఏదో చిన్న ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. సీతారామయ్య గారు చేసినది గవర్నమెంట్ జాబ్ ిన పెద్ద గ ఆస్తులు ఎం సంపాదించలేదు. కానీ అతని మంచితనంకి కట్న కానుకులు ఇచ్చుకునే స్థోమత లేకున్నా అమెరికా సంబంధం వచ్చింది, పిల్ల అందంని, గుణముని చూసి పెళ్లి కి ముహుర్తాలు పెట్టి ,పెళ్లి చేసి పంపించారు. ఇంతలో పెద్ద అబ్బాయి రాహుల్ కి కూడా సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు,ఇద్దరు బాబులు కూడా పెద్దొడికి 6 ఏళ్ళు(chintu) చిన్నోడికి 5 ఏళ్ళు(bujji)  చిన్న అబ్బాయి శేషుకి  కూడా చిన్నపటినుంచి అనుకున్న మేనత్త కూతురు శ్రీలత ని ఇఛ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకి ఒక బాబు వాడికి 3 ఏళ్ళు (chinnu) ఇంకేముంది బాధ్యతలు అన్ని నెరవేరిపోయాయి. రిటైర్డ్ అయిపోయారు, శేష జీవితాన్ని రామ కృష్ణ అనుకుంటూ గడపటమే. రామయ్య గారు ఉదయానే మార్నింగ్ వాకింగ్ కి వెళ్లటం అక్కడ ఉన్న ముసలి బ్యాచ్ అంత కస్ట సుఖాలు మాట్లాడుకోవటం , నవ్వుకోవటం ఇంకా యింటికి వచ్చే దారిలో మార్కెట్ కి వెళ్లి కాయగూరలు తెచ్చి పెడితే జానకమ్మ వండి పెడుతుంది. ఇంట్లో ముగ్గురు ఆడాళ్ళు త్వరగా వంట, వార్పూ  ముగించుకొని మిగతా టైం వాళ్ళ పిల్లల పనులు చూసుకుంటారు.

జానకమ్మ కి శ్రీలత అంటే ఇష్టం. ఆడపడుచు కూతురు దగ్గర అమ్మాయి చిన్నప్పటి  అత్తా  అత్తా అంటూ కొంగు పట్టుకొని తిరిగేది. అందుకే ఏ మాట అయినా , ఇంకా ఎథినా చిన్నప్పటి నుండి అలవాటు మీద శ్రీలత ని పిలుస్తుంది. కానీ పెద్ద కోడలు ఉడుక్కుంటాది. ఏ నఘ అయినా ఎం చేసిన వెనకేసుకువస్తాది అని. నిజానికి పెద్ద కోడలికి ఒకేలా చేస్తది కానీ చిన్న కోడలు అంటే ఇష్టం అని తన భ్రమ. ఏ పని అయినా పిలుస్తుంది నాకన్నా ఎక్కువ పని థానే చేస్తుంది అనుకోవట్లేదు. రాహుల్, శేషు తెల్లారి 9 కళ్ళ ఆఫీస్ లు చేరుకోవాలి. శేషు సంపాదన , రాహుల్ కన్నా కాస్త ఎక్కువ. అందుకే వచ్చేప్పుడు పిల్లలకు తినటానికి కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సినవి తెస్తుంటాడు, రాహుల్ పీనాసి, డబ్బులు తన సొంత గ దాచుకోవాలనుకుంటాడు, ఇంట్లో ఎంత మంది దగ్గర ఖర్చు పెడితే దాచుకోవటానికి ఉండదని, కానీ పెద్దకోడలికి ఎన్నాళ్ళు అత్త మామ ల పెత్తనం. పెళ్లి అయ్యి ఎన్నాళ్ళు అయినా స్వంతం గ బ్రతికే అవకాశం లేదు అని ఎప్పుడు నస పెడుతుంటుంది. కానీ బయటకు చెప్పదు . ఇంట్లో పిల్లలు కూడా ముగ్గురు ఉన్నారు, ఇంట్లో సందడిగా వాళ్ళ అల్లరితో ఆనందగ, అలికిరిగా వాళ్ళ ఇల్లు వెలిగిపోతూ ఉంటాది.

పిల్లలు అన్నాక ఆడుకోవటమే కాదు కొట్టుకోవడాలు కూడా ఉంటాయి. అలాగే శ్రీలత కొడుకు 3 ఏళ్ళు పిల్లవాడు. తెలిసి తెలియని వయసు. చిన్నూ ఇంకా ఏమైనా కావాలి అని అడిగాడా కొనే వారు మంకు పట్టు పడతాడు. అలాగే బుజ్జి దగ్గర ఉన్న రీమోట్ కార్ ని చూసి నాకు కావాలి అని ఒకటే ఏడుపు,  శ్రీలత బుజ్జి ని కాస్థ ఏమార్చి చిన్నూ కి ఆడుకోమని ఇస్తుంది. కొంతసేపు ఆడుకున్నాక ఇవ్వమని బుజ్జి అడిగేసరికి నేను ఇవ్వను అని మారం చేస్తాడు. దానితో బుజ్జి కి చిన్నూ కి కొట్టుకొనేవారుకూ వస్తుంది. ఇదంతా చుసిన పేద్దొడు చింటూ కూడా ఆ గొడవలో వెళ్లి ముగ్గురు తన్నుకుంటారూ. బుజ్జి కి కరిచేస్తాడు చిన్నూ.

జానకమ్మ పిల్లలందర్నీ విడిపించి లడ్డు చేసి పెడుతుంది. ఇంకా అవి తినే పనిలో పడి కొట్టుకున్న సంగతే మర్చిపోతారు పిల్లలు. కానీ పెద్ద కోడలు పిల్లల గొడవను అడ్డం పెట్టుకొని మొగుడు వచ్చేసరికి రాగాలు టిస్తూ మమ్మల్ని ఇంటిలో ఉంచనివ్వరు. మేమంటే ఎవరికి గిట్టదు అనే రాగాలు తెస్తోంది. ఏమి తెలియని రాహుల్ గాబరాగా వచ్చి ఏమైంది అని అడుగుతాడు. ఇంకా రాగాలు పెడుతూ జరిగినది చెప్పి భర్త ని ఏమార్చి ఇంటిలో నుండి బయటకు వెళ్లిపోదామని చెప్తుంది. ఎప్పటినుండో అడుగుతున్న భార్య కి ఏమి చెప్పలేక సరే అని తండ్రి దగ్గరకు వెళ్లి మేము వేరే కాపురం పెడతాము. మొదటినుండి అమ్మ కి న బార్యన్న పిల్లలు అన్న ఇష్టం లేదు. శ్రీలత ని బాగా చూసుకుంటుంది. చిన్నూ ని దగ్గరకు తీసుకుంటుంది అని చెప్పివాళ్ళ సమన్లు సర్దుకొని రెడీ అవుతారు.  

ఏమి తెలియని శేషు ఎప్పటిలానే ఏంటికి ఆఫీస్ పనులు చుటూ లేట్గా వస్తాడు. ఆ రాత్రి తల్లి భోజనం పెడుతూ జరిగినది అంత చెప్తుంది. కానీ నాన్న ఎం అంటారో చెప్పని అమ్మ నేను ఏ విషయంలో కలుగ చేసుకోవాలని లేదు అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోతాడు శేషు.

మరుసటి రోజు సుఇటుకేసి తో వాళ్లకు కాలాల్సిన సామానుతో సర్దుకొని బయ్యకు వస్తారు రాహుల్ వాళ్ళు, ఇంతలో సీతారామా కు నాన్న మేము వెళ్లొస్తాం అని చెప్పి బయల్దేరిన రాహుల్ కి సీత రామయ్య సరే వేళ్ళు, కానీ నే జీతం ఎంత ? బయటకు వెళ్తే ఏళ్ళు తీసుకోవాలి దానికి రెంట్ ఎంత కరెంటు ఎంత ఎప్పుడు బయట కాపురం పెట్టాలంటే మంచం, కుర్చేలు వండుకోడటానికి సమన్లు ఇంకా ఇంట్లో ఫర్నిచర్ ఇవన్నీ కొనటానికి డబ్బులు ఉన్నాయా ర ఏమైనా కావాలా అని అడుగుతాడు, అప్పటికే లెక్కల్లో పీనాసి తనం లో ఉన్న రాహుల్ కి ఏవి అని తెలిసి భార్య ఐ నచ్చచెప్తడు, ఇంట్లో పెద్ద వాళ్ళు మీకు తోడుగా ఉన్నారు అంటే మీ కాపురాన్ని కాదు సంసారాన్ని కూడా చక్కదిద్దడానికి. ఉమ్మడి కుటుంభం లో ఉన్నాము అంటే ఒకరినిఒకరు అర్ధం చేసుకుంటూ తినగ ఖర్చు పెట్టగ వచ్చే సొమ్ము ని ఆదా చేయటానికి, ఎవరికీ నచ్చినట్టు వెళిపోతే మేము ఎంధుకు మా పెద్దరికం ఎందుకు అని అడుగుతాడు.

ఇంతలో జానకి కోడలిని తీసుకు వెళ్లి శ్రీలత అంటే నాకు ఇష్ట నిజమే కానీ నే కన్నా ప్రతి పనిలో తననే పిలుస్తుంటే తాను విసుగుకోకుండా వస్తుంది అందులోను చిన్నప్పటి నుండి మమ్మల్ని దగ్గరగా చూసి పెరిగిన అమ్మాయి కానీ నిన్ను వేరేగా ఎప్పుడు అనుకోలేదఅని ఇంకా చిన్నూ గాడు ఇంకా చిన్నూ గాడు వీరిద్దరికంటే చిన్నోడు. చంటి బిడ్డ , నాకు మనుమలు అంత ఒక్కటే, ఎవరైనా న కొడుకులకి పుట్టిన పిల్లలే, నేను ఎప్పుడు ఆలా చేయను, శ్రీలత ఏమైనా చేస్తే ఒక్కోసారి దండిస్తా కూడా నువ్వు కూడా చూస్తావు, నేక్ ఎప్పుడైనా ఏమైనా అన్న పాపం ఎరగను. ఉమ్మడి కుటుంభం లో ఉండటం వలన పిల్లలకు ప్రేమాభిమానాలు పెరుగుతాయి, కష్టం విలువ తెలుస్తుంది. ఏ విషయం ిన నలుగురికి చెప్పడం వలన ఈజీ గ పరిష్కరికిన్చుకోవచ్చు. ిన బరువు బాధ్యతలు ఏమి ఇన మీ మామ గారు నేను చేసుకుంటున్నాం. అన్ని నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు కి ఎంతో ఉపయోగ పడుతుంది అని చెప్పి సముదయిస్తుంది, దానితో లతా లో మార్పు వచ్చి సర్దిన సుఇటుకేసి ను సామాన్లను మల్లి వాళ్ళ రూమ్ లో పెట్టనికి వెళ్తుంది. అటు మామగారికి అత్తగారికి చేసిన తప్పు ను తెలుసుకొని క్షమాపణలు చెప్తుంది.

నోట్: పెద్ద వాళ్ళు ఇచ్చిన సలహాలను వారు ముందు ఉండి నడిపించే ఇళ్లలోనూ కష్టం అనేది ఉండదు, పరిస్కారం కానీ సమస్యలు కూడా ఉండవు.