పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర

పవన్ కళ్యాణ్ పేరు వింటేనే ఒక ప్రభంజనం, రాజకీయ అవకతవకలపై గొంతు ఎత్తిన ఒక గళం, యువకుల రక్తం లో ఒక ధైర్యం, ఒక ఆదర్శం, నిరాశ్రయులకు ఒక నమ్మకం, అభిమానుల గుండెల్లో ఒక దైవం, ప్రజల గుండెల ఆవేదనలు చప్పుడు కు సమాధానం ఈ పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ని సినిమా లో పవర్ స్టార్ అని, రాజకీయాలలో జనసేనాని అని అభిమానులు పిలుస్తారు.

కొణిదెల వెంకట్ రావు గారు మరియు అంజనా దేవి 3వ పుత్రుడు మరియు 5వ సంతానంగా మన కళ్యాణ్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో గుంటూరు జిల్లా, బాపట్ల గ్రామంలో సెప్టెంబర్ 2, 1971 న పుట్టారు. మరియు కళ్యాణ్ బాబు కి ఇద్దరు అక్కలు మరియు ఇద్దరు అన్నదమ్ములు. తెలుగు సినిమా నటులు పెద్ద అన్నయ్య (కొణిదెల శివశంకర వర ప్రసాద్) మెగాస్టార్ చిరంజీవి. మరియి చిన్న అన్నయ్య (కొణిదెల నాగేంద్ర బాబు). కొణిదెల వెంకట్ రావు గారు ఒక కచ్చితమైన నిజాయితీ గల పోలీస్. మరియు గంపెడు సంతానం తో ఆర్ధిక ఇబ్బందులతో ఎంత గానో బాధ పడేవారు కానీ ఎప్పుడు అవినీతిగ డబ్బును సంపాదించలేదు. ఆ నిజాయితీని పిల్లలకు ఆస్తిగా ఇవ్వాలని అనుకునేవారు. కష్టపడితే ఏదిన సాధించచ్చూ అనే నమ్మకం మరియు ధైర్యం ని నిజాయితీ, నీతి లను పిల్లలకు చెప్పేవారు. మరియు పెద్ద కొడుకైన శివశంకర వర ప్రసాద్ ఆ విధం గానే కస్టపడి సినిమాలలో మెగాస్టార్ గ నిలిచారు. వారి తమ్ముళ్లకు అదే వృత్తిల ప్రావీణ్యం వంతులను చేసి వాళ్ళని కూడా స్టార్ గ ఎదగడానికి అన్ని ప్రయత్నాలను చేసి మన ముందు నాగేంద్ర బాబు ని మరియు కళ్యాణ్ ని నటులు గ హీరోగ పరిచయం చేసారు.

కళ్యాణ్ గారు చిన్నప్పుడు ముభావంగా , భయస్తునిగా, పిరికితనం తో ఒంటరిగా మరియు అనారోగ్యం ఆస్తమా తో బాధపడుతూ ఉండేవారు మరియు చదువులో కూడా వెనుకబడి ఉండేవారు. ఆ కారణంగ చలాకిగ, అల్లరిగ తిరిగే సందర్బాలు తక్కువ, మరియు అతి తక్కువ చనువు, స్నేహితులు కూడా లేక పోవడం, గట్టిగ మాట్లాడితే ఎవరు కొడతారు, తిడతారు అనే భయాలు అత్యంత పిరికి తనంతో ఉండేవారు. కానీ తల్లి ఎప్పుడు హనుమాన్ కధలను, విజేతల కధలను మరియు ధైర్య సాహసాల జీవిత చరిత్రలను చెప్పి ఉత్తేజ పరిచేది. ఇంట్లో ఆర్ధిక పరిస్థులు మరియు కళ్యాణ్ అనారోగ్య పరిస్థితుల వలన ఇంట్లో గడవడానికి కూడా ఇబంధులు పడే సందర్భాలు ఉన్నాయి. ఒక మధ్య తరగతి కుటుంభం లో పుట్టిన కళ్యాణ్ బాబు కి బాధలు కష్టాలు పడే వచ్చారు. మన కళ్యాణ్ గారికి తెలుగు అన్న, scince అన్న చాల ఇష్టం మరియు లెక్కలు అంటే చాల భయం. స్కూల్ లో ఉన్నప్పుడే ఆర్యభట్ట సైన్స్‌క్లబ్‌కు ప్రెసిడెంటుగా ఉండేవారు. నాయకత్వ లక్షణాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. మరియు 10వ తరగతి లో లెక్కలు ఫెయిల్ కూడా అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. ఎన్టీఆర్‌ను పదవిలోంచి దించేసి, నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనిచ్చిన ఐదు గ్రేస్‌మార్కులతో ఒడ్డునపడిపోయారు. భూతంలా భయపెడుతున్న లెక్కల మీద, ఎలాగైనా పట్టు సాధించాలని ఇంటర్‌లో ఎకనమిక్స్‌, కామర్స్‌తో పాటూ గణితాన్నీ తీసుకున్నారు. కాలేజీలో ‘చిరంజీవి తమ్ముడు’ అన్న ముద్రపడిపోయింది. చిరంజీవి అభిమానించేవాళ్లు ఉండేవారు, విమర్శించేవాళ్లూ ఉండేవారు.

చిన్నప్పటి నుంచే పిరికితనం వలన తల్లి తండ్రులు మరియు నాగేంద్ర బాబు అన్నయ్య ఎన్నో విజేతల కథలు వినిపించేవారు. ఆక్రమం లో పుస్తకాల మీద ఆసక్తి కలిగి ఎన్నో విజేతల కథలను చదివేవారు. ఆ క్రమంలో గాంధీ గారి సత్య శోధన, రామకృష్ణ పరమ హంస, భగవద్గీత మరియు, చావెజ్, యోగానంద, ఓ యోగి ఆత్మ కథ, చేగువేరా, ఇంకా చాల పుస్తకాలను చదివి జీవితం లో ఏ విధం గ పైకి రావాలి అనే అంశం తో ఉండేవారు. మరియు ఇంటర్ లో కూడా ఫెయిల్ అవటం తో, జీవితం లో ఏది సాధించలేను అనే భావనతో, మరియు వార్తలలో సచిన్‌ తెందుల్కర్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌… లాంటివాళ్లు వయసుకు మించిన ప్రతిభ కనబరుస్తున్నట్టు వార్తలు వచ్చేవి. నేనే ఎందుకిలా ఉన్నాను? – అన్న నిస్పృహ వెంటాడేది. ఆ ఒత్తిడిలో కళ్యాణ్ గారు ఆత్మ హత్య కు పాల్పడ్డారు. చదువులోనే ప్రతిభలు కనబడవు , ప్రతిభ సాధించడానికి చాల మార్గాలు ఉన్నాయ్ అని ధైర్యం చెప్పి కళ్యాణ్ ని చిరంజీవి గారు సీనిమాలలో రమ్మని చెప్పారు.

ఓసారి నాగబాబు గారు వేయిమంది విజేతల కథలున్న వేయి జీవితాలూ… వేయి విజయాలూ – ఓ పుస్తకం ఇచ్చాడు. అందులోనూ లియొనార్డో డా విన్సీ బహుముఖ ప్రతిభ ఆశ్చర్యపరచింది. ఆయనలా, ఒకేసారి అనేక రంగాల మీద పట్టు సాధించాలని ఉండేది. ప్రతి వృత్తీ ఆసక్తిగానే అనిపించేది. ఏదీ కళ్యాణ్ గారిని పట్టి ఉంచేది కాదు. దీంతో అన్నీ అరకొరగానే నేర్చుకున్నా. దేశమంతా తిరిగారు. పారా గ్లైడింగ్‌ నేర్చుకున్నరు. కర్ణాటక సంగీతంలో ప్రవేశం సంపాదించారు. వయొలిన్‌ సాధన చేశారు. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సులో చేరారు. బొమ్మలేసే ప్రయత్నం చేశారు. విదేశీభాషలు నేర్చుకోవాలనుకున్నారు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ గురించీ కొంత తెలుసుకున్నారు. అలా….రెండుమూడేళ్లు గడిచిపోయాయి. ఆయోమయం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి రోజంతా సినిమాలు చూసేవారు. ‘రేయ్‌! వీడియోలు చూసీ చూసీ వీడియో రికార్డర్‌లో హెడ్‌లు అరుగుతున్నాయే కానీ, నీ హెడ్‌ లోంచి ఒక్క ఐడియా కూడా రావడం లేదు’ అని మందలించేవారు అన్నయ్య. చివరికి, ‘ఇన్ని అవకాశాలిచ్చినా నువ్వేమీ చేయడం లేదు. ఇవన్నీ ఎందుకు కానీ, సినిమాల్లో ప్రయత్నించు’ అని సలహా ఇచ్చారు. కళ్యాణ్ కి మాత్రం నటించగలననే నమ్మకం కుదర్లేదు. వీలైతే, ఎవరిదగ్గరైనా అసిస్టెంట్‌ డైరెక్టరుగా చేరాలని ఉండేది. ఆ మాటే చెప్పారు. ‘నువ్వు ఇంకెవరి దగ్గరో పనిచేయగలవని నేను అనుకోవడం లేదు…’ అని తేల్చేశారు. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఓ షార్ట్‌టర్మ్‌ కోర్సు ఉండేది. విద్యార్హతతో పన్లేదు. దరఖాస్తుతో పాటు ఓ షార్ట్‌ఫిల్మ్‌ పంపితే చాలు. ఓ అంధుడి ప్రపంచం ఎలా ఉంటుందనే కోణంతో కథ రాసుకుని ఫిల్మ్‌ తీసి పంపారు. వెంటనే బయల్దేరి రమ్మని కబురొచ్చింది, ఫీజు ఎక్కువ. ఇప్పటికే అన్నయ్య చిరంజీవి గారికి బరువైపోయారు. మరింత భారం వేయడానికి మనసొప్పలేదు. న్యూయార్క్‌ ఆలోచన విరమించుకున్నారు. మిగిలింది ఒకటే దారి, అన్నయ్య చెప్పినట్టు సినిమాల్లో నటించడం. సత్యానంద్‌ గారి దగ్గరికి చిరంజీవి గారు పంపారు. నటన సంగతి తర్వాత, ముందు కళ్యాణ్ లో బిడియాన్ని పోగొట్టడం చాలా అవసరమని ఆయనకు అర్థమైపోయింది. మొదట్లో, లేచి నిలబడి బిగ్గరగా అరవమని చెప్పేవారు. అలా అరవాలంటే జంకూగొంకూ ఉండకూడదు. ఎవరేం అనుకుంటారో అన్న ఆలోచనే రాకూడదు. ఆ సాధన బాగా ఉపయోగపడింది. అలా సిగ్గునూ మొహమాటాన్నీ బద్దలుకొట్టారు. సినిమా చేసినా చేయకపోయినా, నా బతుకు నేను బతకగలననే ధైర్యం కలిగింది. అదో గొప్ప మార్పు. మొదటి సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది కానీ, రెండుమూడేళ్లు గడిచినా షూటింగ్‌ మొదలుకాలేదు. ఏం చేయాలో తోచేది కాదు. ‘ఇక ఎదురుచూసే ఓపికలేదు, రేపటిదాకా చూస్తాను. బెంగళూరు వెళ్లిపోయి ఏదైనా నర్సరీలో మొక్కలు పెంచుకుంటాను. నాకు తెలిసిన పని అదొక్కటే..’ అని అమ్మకు స్పష్టంగా చెప్పేశారు. అనూహ్యంగా, ఆరోజు సాయంత్రానికే సినిమా ఖరారైపోయింది.

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంద్వారా పవన్ కళ్యాణ్గా తెలుగు తెరకు పరిచయమయ్యరు. 1997 లో గోకులం లో సీత, 98 లో సుస్వాగతం, 99 లో సుభాష్, 2000 బద్రి, 2001 ఖుషి, 2003 ఝాని, 2004 గుడుంబా శంకర్, 2005 బాలు, 2006 బంగారం, 2007 అన్నవరం, 2008 జల్సా, 2010 కొమరం పులి, 2011 పంజా, 2012 గబ్బర్ సింగ్, 2012 కెమెరా మాన్ గంగ తో రాంబాబు, 2013 అత్తారింటికి దారేది., 2015 గోపాల గోపాల, 2016 సర్ధార్ గబ్బర్ సింగ్, 2017 కాటంరాయుడు, 2018 అజ్ఞాతవాసి, ఇలా 20 సినిమాలను పుతి చేసారు. నటనలో తనదిన శైలి తో అభిమానులను పొందారు, మరియు నెంబర్ వన్ హీరో గ ఎదిగారు, ఎన్నో అవాంతరాలను చూసి కాస్త పది తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. చిరంజీవి గారు ఇచ్చిన ప్లాట్ఫారం ని యూస్ చేసుకున్న చిరంజీవి గారి కన్నా గొప్ప గుర్తింపును , ఆరుదిన అభిమానులను సొంతం చేసుకున్నారు. యూత్ అందరికి ఆదర్శం గ నిలిచారు, ఫెయిల్యూర్స్ ని చుసిన జీవితం లో ఎదిగి ఉన్నత స్థానం కి ఎదిగారు. ఇంతకన్నా ఆదర్శం ఎవరికీ కావాలి,

తమ్ముడు సినిమా కి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను చైనా లో నేర్చుకొని ఎవరు చేయనంత సాహసం చేసారు. డూప్ లేకుండా జీప్లను సుమోలను తన చేతి వేళ్ళ మీద నడిపించారు. బద్రి సినిమా కి నాన్ చాక్ వంటి సాధనాలను ఇంకెన్నో ప్రయోగాలను చేసారు.

తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది.అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు.
తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని అతనే రూపొందించాడు.

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంద్వారా పవన్ కళ్యాణ్గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. గబ్బర్ సింగ్ కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. 2015 లో గోపాల గోపాల చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించాడు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించాడు.త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం ఆజ్ఞతవాసిలో నటించాడు .

మే 1997లో నందీనితో పవన్ కు వివాహం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి సినిమా షూటింగ్ లో నందిని తో పరిచయం, ఆ పరిచయం ప్రేమ గ మరి ఒకరోజు పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వలన పవన్ కళ్యాణ్ నటుడు అని తెలిసి నందిని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం వలన విడిపోయారు, అదే టైం లో బద్రి షూటింగ్ లో రేణుదేశాయి తో పరిచయం మరియు రేణు దేశాయ్ పెళ్లి ప్రస్తావన తేవడం తో పెళ్లి చేసుకున్నారు. కానీ నందిని ఏంటి సభ్యులు పవన్ కళ్యాణ్ ఎదగడం చూసి ఓర్వలేక రేణూ దేశాయ్ తో పవన్ అక్రమ సంబంధం నెరపుతున్నాడని వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడనీ 2007 జూలైలో నందిని కోర్టులో కేసు వేసింది. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయగా, నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కొర్టు స్టే ఇచ్టింది. తర్వాత పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు. నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు ఐదు లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా, ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. ఐదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకొన్నట్లుగా తెలుస్తుంది. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నం లోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరకి విడాకులు మంజూరు చేసింది.

నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్ని 2009 జనవరి 28 న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురొసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణుక ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. విడిపోయే సమయంలోఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకొన్నాననే వార్తలలో నిజం లేదని, తాను స్వయంకృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకొంటున్నానని స్పష్టం చేసింది.

2013 సెప్టెంబరు 30న ఇతని వివాహం రష్యా నటి అన్నా లెజ్‌నేవాతో జరిగింది. అన్నా లెజ్‌నేవా తీన్మార్ లో పరిచయం పెళ్ళికి దారితీసింది. హైదరాబాదు లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. వ్యక్తిగతం గా ఎన్ని నిర్ణయాలు తీసుకున్న, అతని ఎదుగుదలని, ఆత్మస్థర్యాన్ని, తీసుకున్నారు అభిమానులు.

మరియు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎన్నో తెలుసుకొని అతను 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. మరియు ప్రజారాజ్యం ద్వారా జరిగిన తప్పుని తాను పునరావృతం కాకుండా చూసుకోవాలని నిర్ధారించుకొని తన పార్టీని ఏ పార్టీ లోనికి విలీనం చేయమని కార్యకర్తలు కు ముందుగానే స్పష్టం చేసి నమ్మకాన్ని చేకూర్చరు. 2014 మార్చి 14 న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించినతీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు.ఇతని ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగినది. కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న ఆయన నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్కసీటుకూడా కాంగ్రెసుకు దక్కనివ్వలేదు.

ఈ సమయంలో గూగుల్లో అత్యంత ఎక్కువ శోధించబడే రాజకీయవేత్తగా పవన్ నిలిచాడు. ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు. కానీ ఆతరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు. 2019 లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో రెండు చోట్ల పోటీ చేసాడు. ఈ ఎన్నికలలో తాను రెండు స్థానాలలోనూ పరాజయం పాలవ్వగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందగలిగింది. తెలంగాణాలోనూ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.

జనసేన పార్టీ ని స్థాపించి జనసైనికులను బలపరిచి ఎన్నో సంక్షేమ కార్యాలను, మరెన్నో సాయాలను జన సైనికులు నిర్వహిస్తున్నారు.
లొక్డౌన్ లో ప్రజలు పడే కష్టాలకు గాను పెద్ద ప్రజలకు నిత్యావసర సరుకులను పంచి పెట్టారు ఆర్ధిక ఇబ్బందులు పడే ప్రజలను ఆదుకున్నారు. అంతే కాకుండా ఆక్సిజన్ సీలిండెర్స్ ని హాస్పిటల్స్ కి పంచి పెట్టారు. . మరియు వరదలలో ఉండే ప్రజలను జనసైనికులు కాపాడారు.
జనసేన పార్టీ అధినేత అయినా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జనసైనికులు ప్రజల కష్టాలను తెలుసుకొని వారి కష్టాలను తీర్చే సాయుధులలా పనిచేస్తున్నారు.

అత్యంత భయస్తునిగా, అనారోగ్యము తో బాధపడిన, ఒక చలాకి లేని పిల్లడు, చదువులో కూడా ఫెయిల్ అయినా 18 సంవత్సరములుకే జీవితం మీద విరక్తి చెంది ఆత్మ హత్యకి పాల్పడిన పవన్ కళ్యాణ్ ఈనాడు అనర్గళం గ మాట్లాడి ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగి ఎందరో యువతకి ఆదర్శం గ నిలబడి నిరంతర సేవ చేస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికీ ఎదిగి కష్టం అన్న ప్రజలకు నేనున్నా అంటూ హామీ ఇస్తూ యువత కి ఒక ఆదర్శం గ నిలిచారు.
note : ప్రతి ఒకరి జీవితం లో కష్టాలు, బాధలు ఇబ్బందులు ఫెయిల్యూర్స్ వస్తాయ్ కానీ దానిని తట్టుకొని నిలబడి ఎదురుతిరిగి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పట్టుదల కృషి తో మాతృసమే సాధించగలరు.

  • నవంబరు 2017 లో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకొన్నాడు. నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు.

.

6 Comments on "పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర"

  1. скільки буде тривати війна в україні 2022 коли закінчиться війна в україні 2022 екстрасенси скільки триватиме війна

Comments are closed.