నా మధి !

ఇలలోన పుట్టాను ఇంతత్తై ఎదిగాను

రామాయణం అన్నారు రాజబాటన్నారు

సీతమ్మ తల్లిలా సిత్రంగా చెప్పారు

ఆ తల్లి గీత దాటినా వాడు రాముడు కాదు

రావణుడు రాలేదు

ఏడడుగులు అన్నారు, మూడు మూళ్ళ బంధం అన్నారు

అగ్నిసాక్షి అంటారు ముక్కోటి దేవతలంటారు

అమ్మ చెప్పింది నాకు!

తప్పు లేకుంటే దేముడినైనా ఎదురించు అని.

ఆ గొప్ప సూక్తులు సాక్షాలుగా లేవు

చిట్టి తల్లిలా చూసారు, చిరు దివ్వెల కాచారు,

అల్లారు ముద్దుగా, ముచ్చటగా పెంచారు.

ఒక్క తప్పు లేకుండా వంద తప్పులు భరించాను.

చిన్నారి తల్లిలా చిట్టి తల్లిలా పెంచారు.

అన్న అనురాగం, నాన్న మమకారం

అమ్మకి నేనంటే మరెంతో మమకారం

నింగి, నేల, నిప్పు, నీరు సాక్షాలు అంటారు.

మరి ఇవి అన్ని మౌనంగా ఎందుకు ఉన్నట్టు?

కట్నాలు ఇచ్చారు, కానుకులు కొన్నారు

అత్తామామలన్నారు హద్దులు గూడా దాటారు.

మొగుడే కాదు వాడు మగాడు కూడా కాదు

 అన్ని భరించాను, విధి ఆటలో బొమ్మనై ఆడాను 

 నా  ప్రశ్నకు బదులేది? జవాబు ఎక్కడ?

నోరు లేని సాక్షాలు బధులేమి  చెప్తాయి ?

తీర్పు ఏమని ఇస్తాయి?

కనిపించని దేముడు తో ఏమని…. అడగను?