1 జీవితం నేర్పిన పాఠం | Telugu Stories in Telugu | Charitralu in Telugu

జీవితం నేర్పిన పాఠం

నా హృదయమా!
నిన్ను కదిలిస్తే కన్నీటి వ్యథలెన్నో
మూడు ముళ్ళ బంధమే ముళ్ల కంచెయై
ఏడు అడుగుల సంబంధమే నిప్పుల కొలిమియై
వెంటాడిన వేధించిన అన్ని సహించిన నేను
బాధ్యతలను మరిచి దూరమైన మృగానికి
బలిఐన నా జీవితానికి
వెలుగులా వర్షం కురిసేదెప్పుడో ?
మరువలేని భావాలూ మరుపురాని శాపాలైతే
మనసే ఉవ్వెత్తున ఎగసిపడే కడలి కెరటమై
పఢీ లేచిన జీవితాన్ని తీరం వెంబడి ప్రయాణిస్తుంటే
సమాజం చూపులకు కోటి ప్రశ్నలు వెతుక్కుంటే
అలుపెరగని మనసు గాయాలకు కన్నీరు ఎండగా
ఎదురవ్వని దేముడిని ఏమని ప్రార్ధించాలి?
ఏమని విన్నవించాలి?

అది ఒక అందమైన సాయంత్రం. డాబా పైన టీ తాగుతూ ముచ్చట్లలో మునిగారు ఆ తల్లి కూతుళ్లు. మెయిన్ రోడ్ మీద ఇల్లు కావటం తో ఆ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీ లో కూర్చుంటే చాలు. వచ్చి పోయే వాళ్ళు ఆటో లు బైక్ లు సందడి. రోడ్ మీద వవెళ్తున్న వాళ్ళ మాట్లాడుకొనే ముచ్చట్లు అంతా హడావిడిగా బలే గమ్మత్తుగా కూడా ఉంటాది.. ఇంతలోనే మురళి గారు అంటూ ఆ వీధిలోనే ఉండే పార్వతమ్మ గారు ముచ్చట్లకి వచ్చారు. ఇంక రుషిక సరే అమ్మ నువ్ ఆంటీ తో మాట్లాడు నేను కిందకి వెళ్లి వర్క్ చేసుకుంటా అని చెప్పి ఇంటికివచ్చిన పార్వతమ్మ గారికి టీ చేయడానికి వెళ్లి టీ ఇవ్వటానికి వెళ్తుండగా ఏమండి రుషిక ని ఇంకా అలాగే ఉంచేస్తారా . ఏమైనా అనుకుంటున్నారా అనే మాటలు వినబడ్డాయి కానీ ఏమి తెలియనట్టు టీ అందించి మరల కిందకు వెళ్లిపోయింది.

కిందకు వస్తూనే మనసులో తన గురించి ఆలోచన లో పడింది. రుషిక వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ మరియు చాల నెమ్మదస్తులు అమ్మ మురళి కూడా చాల మంచిది. ఎవరికైనా సాయం చేసే గుణం మరియు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోవటం తప్ప ఇంకేమి ఎరగరు. నలుగురికి సహాయపడితే పిల్లలకు కాస్తదనే నమ్మకం వల్ల నాన్నగారిది. ఇంట్లో తల్లి చాటు బిడ్డ రుషిక, సరదాఐనా సందడిఐనా అంత తల్లే తనకు, చిన్నప్పటి నుంచి గారాబం ఎక్కువ. ఇంకా రుషిక కూడా అలానే చక్కగా పెద్దలు చెప్పిన మాటలు వింటూ వాళ్లకు గౌవరం ఇస్తూ తల్లి చెప్పినట్టే చేస్తుంది. ఇంకా రుషిక కు ఒక అన్నయ్య ఇద్దరు తల్లి చాటు బిడ్డల్నే పెరిగారు. సెలవులకైనా పెద్దమ్మలు పిన్ని లు ఇంటికి రావటమే తప్పే మురళి మాత్రం ఎక్కడికి ఒంటరిగా పిల్లలను పంపించేది కాదు. రుషికకు స్కూల్ లో వాగుడుకాయఅని పేరు కూడా. ఐతే తన ఇంటర్ లో అందరు చెప్పడం వల్లనో లేదో తన మనసుకే అనిపించిందో తేలీదు. రుషికకు వాళ్ళ బావ అంటే ఇష్టం పెరిగింది. ఫ్రెండ్స్ ఏడిపించడం వల్లనో ఏమో తనకి వాళ్ళ బావ మీద ఇష్టం పెంచుకుంది. ఈ క్రమంలోనే వాళ్ళ చిన్న అన్నయ్య కు తన మనసులో మాటని చెప్పింది. అది తన 17వ ఏట మా ఫ్రెండ్స్ అంత నన్ను ఇలా ఏడిపిస్తారు అని. అన్నయ్య వారించటం పోయి నీధి లవ్ అని ఫిక్స్ చేసి బావని చెల్లెలని కలిపాడు. ఇంకేముంది వర్షం వచ్చాక ఇంద్రధనుస్సు ల తన జీవితాన్ని వాళ్ళ బావ తో ఊహించుకోవటం స్టార్ట్ చేసింది. ఇంట్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ లేదు. సెట్ కాలేరు అని. కానీ మొండి పట్టు పట్టింది రుషిక, చేసేది ఏమి లేక తల్లి తండ్రులు వారు అడిగిన కట్నం ని కట్టబెట్టి అంగరంగ వైభవంగా తన పెళ్లిని చేసారు. చాల డబ్బు ఖర్చుపెట్టారు. ఇంకా రుషిక ఆనందం కి అవధులు లేవు. ఫస్ట్ నుంచి తన బావ తో ప్రేమ లోనే ఉంది కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవడం కానీ లేదా బయట కలుసుకోవటం కానీ చేయలేదు. రుషిక వాళ్ళ ఇంట్లో బాగా స్ట్రిక్ట్. ఇంకేముంది పెళ్లిఐన తర్వాత జీవితం మొత్తం నా బావ తోనే అనుకుంది. ఇంకా వాళ్ళ బావ హైద్రాబాద్ లో ఉద్యోగం సో వాళ్ళ కాపురం కూడా అక్కడే పెట్టారు. రుషిక వాళ్ళ అమ్మ , కూతురికి ఎటువంటి కష్టం పడకూడదని సూది దారం తో సహా వాళ్ళ కాపురానికి అన్ని సమకూర్చి పెట్టి తిరుగు ప్రయాణం అయ్యింది.

ఇంకా తన బావ హైదరాబాద్ కదా పొద్దున్న 7:30 కె బయలుదేరేవాడు ఆఫీస్ కి ఆ ట్రాఫిక్ లో ఆఫీస్ కి వెళ్లాలంటే రెండు గంటల ముందు బయల్దేరాలి, ఇంకా రుషిక కూడా తన లంచ్ బాక్స్ కి వండిపెట్టడం రాత్రి వచ్చేసరికి టైం కాస్తా 9 కానీ 10 కానీ ఇయ్యేది ఇంకా వాళ్లకు మాట్లాడుకోవడానికి కూడా టైం సరిపోయేది కాదు. మధ్యలో తన పని తాను చేసుకొని ఎం బి ఏ ఎగ్జామ్స్ ఇంకా తన ప్రోజెక్ట్  చూసుకొనేది. ఇంకా రాత్రి అయ్యసరికి తన బావ గురించి ఎదురు చూసేది. ఇంకా మధ్యలో వాళ్ళ బావ చేసే కంపెనీ యూ స్ ఏ కంపెనీ కావటంతో నైట్ షిఫ్ట్ లు కూడా ఉండేవి. కానీ శని, ఆది వారాలు సెలవు కావటం తో సినిమాలకి షాపింగ్ లకి తిరిగేవారు. 2 నెలలు గడిచాయి ఏదో పని మీద పుట్టింటికి వచ్చింది రుషిక. నెల రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ టైం లో కూడా తాను ఒక్కసారి కూడా రాలేదు మరియు ఎక్కువ ఫోన్లు కూడా మాటాడేవాడు కాదు. నైట్ షిఫ్ట్ లు మాత్రమే కంపెనీ లో నడిచేవి. ఒక రోజు తన బావ దగ్గరనుంచి ఫోన్ మా ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అయ్యింది. నా చైన్, ఉంగరం, బ్రాస్లెట్ తాకట్టు పెట్టేసా వాడికి మల్లి తెలివి వస్తే మనడబ్బులు మనకి ఎస్తాడు అప్పుడు విడిపించుకోవచ్చు అని చెప్పాడు. సరేలే ఫ్రెండ్ ని కాపాడటం కోసమేగ అని ఊరుకుంది.

ఇంకా ఏ విషయం తన అత్త మామలకు గాని తన తల్లి తండ్రులకు గాని చెప్పద్దు కంగారు పడతారు అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. కానీ ఋషికాకి మాత్రం తన మనసులో కంగారు. మా ఇంట్లో తాకట్టు పెట్టడాలు, అప్పులు చేయటాలు తేలీదు కానీ తాను అంత ఈజీగ మా అమ్మ వాళ్ళు తనకి కట్నంగ ఇచ్చిన వస్తువులని తాకట్టు పెట్టేసాడు అని. ఇంతలోనే తాను తిరిగి హైదరాబాద్ వెళ్ళింది. మాఫ్రెండ్ తాకట్టు పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు అని చెప్పాడు.కానీ బావ ప్రవర్తనలో మార్పు తనతో అస్సలు మాటాడేవాడు కాదు. నైట్ షిఫ్ట్ అని వెళ్లిపోయి తిరిగి మల్లి తెల్లవారి వచ్చిన పడుకొనే వాడు తిరిగి ఆఫీస్ కి బయలుదేరేవాడు. కానీ రుషిక వాళ్ళ అత్త కు అన్ని తెలుసు ఏదో జరుగుతుందని గమనించింది. కొడుకుతో రహస్యంగ మాటాడేది. కానీ రుషిక కు మాత్రం ఏ లోటు లేకుండా చూసేది. ఇంతలోనే ఒక రోజు రుషిక కు పొద్దున్నే కాల్ వచ్చింది  నువ్ నన్ను మర్చిపో నేను ఈరోజు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్న అని. నిన్ను నేను మోసం చేశా నన్ను క్షమించు అని, ఏమి అర్ధం కానీ రుషిక ఏమి చేయాలో తోచక షాక్ లో ఉంది. అంతలో మావయ్య దగ్గరనుంచి కాల్ వచ్చింది నువ్ ఏమైనా అన్నావా  వాడిని అని, లేదు అని చెప్పేలోపే నా కొడుకు చాల సెన్సిటివ్ నువ్ ఏదో అడిగి ఉంటావు అందుకే అలా చేసుకున్నాడు అన్నారు. నా బావే నాకు జీవితం అలాంటిది తాను లేని నా జీవితము నాకు వొద్దు అని తాను కూడా చేతులు కోసుకుని లోపు తలుపు కొట్టిన సౌండ్ కి వెళ్లి చూడగా మావయ్య భార్య (పద్మ)అత్త ఒంటరిగా ఉండకు మా ఏంటికి వచ్చేయ్ అని, ఏడుస్తూనే ఇంటికి వెళ్ళింది. ఇంతలోనే వాళ్ళ పెద్ద బావ బాలు ని పట్టుకొని చనిపోవడానికి కారణం తెలుసుకొని అమ్మ నాన్నలను హైదరాబాద్ రప్పించాడు. ఇవేమి తెలియని రుషిక ఆ రోజు అంత ఆలోచిస్తూ పద్మ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంకా మరుసటి రోజు వాళ్ళ పెద్ద బావ వాళ్ళింటికి వెళ్లగా తెలిసింది బాలు ఆన్లైన్ లో రమ్మీ ఆడీ చాలా డబ్బును పోగొట్టుకున్నడని, ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అని చెప్పిన మాటలు  కూడా అబద్ధమ్ అని తనకి పెళ్లి కాకముందు నుంచే రమ్మీ గేమ్ అలవాటు ఉందని, వల్ల ఆఫీస్ లో కూడా అందరి దగ్గర అప్పులు చేసేశాడని, తనకి రోజు నైట్ షిఫ్ట్ ల మాట కూడా అబద్ధం అని,  ఆ టైం లో తన ఫ్రెండ్ తో పాటు వాళ్ళ రూమ్ లో ఉండేవాడని తెలిసింది. ఇవి అన్ని తెలుసుకొన్న రుషిక కుప్ప కూలిపోయింది చాల ఏడ్చింది తన జీవితం 3 నెలలకే ఇలా అయ్యింది అని, జీవితం ఎలా సాగించాలి, ఎం చేయాలి? ఆ అప్పులు ఎలాతీర్చాలి? అని ఆలోచనలో పడింది. ఇంతలో అత్త గారు, రుషిక మేనకోడలే కనుక తనని ఓదార్చి తనకు ధైర్యం చెప్పింది.

ఇంతలో  తేరుకున్న బాలు దగ్గరకు వెళ్లి తప్పులు అందరు చేస్తారు బావ నువ్ కూడా అంతే, కానీ ఇకమీదట ఎప్పుడు చేయను అని ప్రమాణం చెయ్ అని ఒట్టు తీసుకుంది. తాను చేసిన అప్పులని అన్నిటిని అత్త మామలు తల్లి తండ్రులు తీర్చేసారు. కానీ రుషిక వాళ్ళ అమ్మకి మాత్రం ఏ మాత్రం ఇష్టం లేదు. నాతో పాటు ఇంటికి వచ్చేయ్ పేకాట ఆడీనవాడు జీవితం లో మారె అవకాశాలు లేవు అని చెప్పింది. కానీ బావ మీద ప్రేమతో “తనకి ఒక అవకాశం ఇవ్వాలి కాదమ్మా ” అని తల్లికి సర్ది చెప్పి అత్తగారింట్లో ధైర్యంగ తిరుగుతున్న రుషిక ని చూసి, మురళి నా కూతురు పెళ్లి చేయగానే ఎంత ఎదిగిపోయింది అని తిరుగు ప్రయాణం అయ్యింది.. ఇంకా వేరే ఉద్యోగం కోసం బాలు అప్లై చేసాడు, తెలివైనోడు కావటం వలన గూగుల్ లో జాబ్ వచ్చింది. మరల హైదరాబాద్ తిరుగు ప్రయాణం పెట్టారు, అందరు చాల జాగ్రత్తలు చెప్పి పంపించారు. మురళి కూడా డబ్బులును ఇంటికి కావాల్సిన సరుకులు కొనటానికి ఇచ్చింది. ఇంకా రుషిక వాళ్ళ జీవితం దారిలో పడింది. సరదాగా తిరిగేవారు బాలు వల్ల ఫ్రెండ్స్ తో కూడా సినిమాలు షికార్లు చాల ఆనందంగ ఉండేవారు. రుషిక కూడా తన జాబ్ ట్రైల్స్ స్టార్ట్ చేసి ఇంటర్న్షిప్ మీద జాయిన్ అయ్యింది. తనకి ఒక ఉద్యోగం ఉండాలి లేదంటే తాను చాల కష్టాలు పడాలి, ఆర్ధికంగా నిలబడాలి అని అనుకుంది, ఇంతలోనే రుషిక కడుపులో ఒక బేబీ కానీ అత్త మామలకు ఇష్టం లేదు వాడు స్థిరం కాదు అని, కానీ తల్లి తండ్రులు వారించారు. కావాలి అన్నప్పుడు పిల్లలు పుట్టరు అని ఇంతలోనే తనకి 7వ నెల వచ్చింది చాల ఆనందంగా శ్రీమంతం చేసారు. ఇంతలో బాలు కి ముంబై లో మంచి జాబ్ వచ్చింది శాలరీ కూడా ఎక్కువ అని ఇంట్లో ఒప్పించి హైదరాబాద్ లో ఇల్లుకాలి చేసి ముంబై ప్రయానం పట్టాడు. 7వ నెల కావటం తో రుషిక పుట్టింటికి వచ్చేసింది ఇంతలోనే ఒక చక్కని మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంత ఆనందం తో మునిగిపోయారు.

ఇంతలో అత్త మామల నుంచి తెల్లవారితే ఫోన్ బాలు మల్లి రమ్మీ గేమ్ ఆడేసాడని మల్లి డబ్బులు అప్పు చేసాడని, రుషిక వాళ్ళ నాన్నగారు, ఒక పక్క తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇంకా చేతిలో బాబు తో తన జీవితం ఏమైపోతాది బాలు ఎందుకు ఎలా చేస్తున్నాడు అని ఆలోచనలో పడింది. అంతలోనే తేరుకొని బాలు దగ్గరకు ప్రయాణం పట్టారు. ముచ్చటగా, ముద్దుగా, అందంగా ముసిముసి నవ్వులు నవ్వుతున్న తన బిడ్డకు ఇవి ఏమి ఎరగడు. 2నెలల పిల్లడు వాడు ఆకలి ఏస్తే పాలు తాగడం, నిద్ర వస్తే పడుకోవడం, తెలిసిన వారైనా  తెలియని వారైనా చూసి నవ్వటం తప్ప ఏమి తేలీదు ఆ చంటి బిడ్డకు, మురళి మార్గ మధ్యలోనే చెప్పింది వాడు మారడు ఇంకా అని చెప్పాగ నువ్వు వినలేదు అని, కానీ గుండెలు ఎండేలా ఏడ్చింది. ఎం తప్పు చేసానయ్యా స్వామి ఇలా ఇన్ని కష్టాలు పెడుతున్నావ్ అని, బాలు ని పిచ్చి కోపం తో నా జీవితం నికూడా నాశనం చేసావ్ నీ ఆట పిచ్చితో అని చితకబాదింది. ఇంకా తల్లి సముదాయించి ఇంటికి తెచ్చింది. ఇంకా తన ప్రయానమ్ ఏటో తేలిక జీవితం లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే స్థాయిలో ఉన్న అని అర్థం చేసుకొని తన ఫ్యూచర్ బాబు ఫ్యూచర్ కి ఎం చేయాలో ఆలోచనలో పడింది, కానీ ఎన్ని కష్టాలొచ్చినా తన ఎం బి ఏ  ని కానీ తన జాబ్ రిలేటెడ్ వర్క్స్ ని కానీ వొదలలేదు. ఇంతలో బాలు, స్వాతి దగ్గరకు వచ్చి నేను మారిపోతాను నా తప్పు తెలుసుకున్న, నేను చేసిన అప్పులు ఎవరు తీర్చరూ , నా అప్పులు నేనే కష్టపడి తీర్చుకుంటా, నువ్వు బాబు నా దగ్గరకు వచ్చేయండి అని తల్లి చేత రిఫారసు చేసి అత్త మామలను ఒప్పించి రుషిక ను విశాఖపట్నం తీసుకువెళ్లాడు.విశాఖపట్నం లో పెద్ద బావ తోడికోడలు ఇంకా బాలు రుషిక కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు,వారితో కొన్ని బాధలు పడిన తన కష్టాల ముందు ఇవేమి కాదు అని తాను పట్టించుకోకుండా తిరిగింది.  ఏ తల్లి తండ్రులకైనా కూతురిని పుట్టింటిలోనే ఉంచాలని అనుకోరుగ ఆవిధంగానే కూతురు ని పంపించారు, ఆర్దిక సాయం కింద ప్రతి నెల ఏదో విధంగ డబ్బులు ఇస్తూనే ఉన్నారు. బాబు కి 6 నెలలు వచ్చేసరికి రుషిక వైజాగ్ లో ఒక ఉద్యొగం లో జాయిన్ అయ్యింది. బాబు ని మురళి దగ్గరే వదిలేసింది. కొన్నాలు భానే గడిచాయి చక్కగా ప్రాజెక్ట్స్ తెచ్చుకొని కొంత డబ్బులని కూడా అప్పుతీర్చడు, రుషిక కు అప్పులు తీరిపోతే మా బ్రతుకు మెము గడపచ్ఛు  అనే ఒకటే ఆలోచన .

రుషిక వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇల్లు అక్కడకి దగ్గరే అప్పుడప్పుడు వెళ్తూ వాస్తు ఉండేది. అక్కడే అక్క కొడుకులు కూతుర్లు ఇలా సందడిగా ఉండేది. అందరు ఏ పండగఐనా సరదాగా జరుపుకునేవారు. ఇంతలోనే ఒక రోజు రాత్రి బాలు హాస్పిటల్ లో ఉన్నాడు నువ్ అర్జెంటుగరా అని ఫోన్. వెళ్లి చూసేసరికి మల్లి అదే బాట ఆన్లైన్ రమ్మీ దానికి అప్పుల పలు ఇపోయా అని సూసైడ్ ఆట్టెంప్ట్. బాత్రూం క్లీనర్ హార్పిక్ మింగేశాడు, ఇంకా విసిగిపోయిన రుషిక ఎం చేయాలో తేలిక నాకెందుకు ఇ బ్రతుకు అని ఎందులోనె పడి దూకుదాం అని డిసైడ్ ఐపోయింది. ప్రేమిచి తప్పు చేసానో, తప్పుడు వ్యక్తిని ప్రేమించానో అని మనసులో కుమిలిపోతూ దర్జాగా బ్రతకాల్సిన నాకు ఏంటి ఈ కర్మ దేముడా అని ఏడుస్తుంది. అత్త మామలు,పెద్ద బావ గాని సపోర్ట్ చేయం ఇంకా మీ బ్రథుకు మీరు బ్రతకండి అని వదిలేసారు, చావు బ్రతుకులో ఉన్న భర్తని చూడాలో చంటి బిడ్డని చూడాలో దిక్కు తోచని స్థితిలో ఉంది రుషిక. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ లో ఉన్నందుకు రోజు రోజుకు పెరిగిపోయే బిల్ ని తట్టుకోలేక ఇంటికి తెచ్చారు, 3 రోజులు వరుకు నిద్ర తిండి లేని రుషిక స్నానం కి వెళ్ళింది ఇంతలోనే తలుపు వేసుకోని ఉరి బిగుంచుకున్నాడు. అక్క వాళ్ళ పాపా గట్టిగ తలుపు బాధి తెరిచింది, ఉరి కాస్త బిగుసుకు పడి ఊపిరి పోయేలా ఉన్నాడు, రుషికనే తన బలం అంత తెచ్చుకొని నోట్లో గాలిని బలంగ 15నిమిషాల పాటు ఆగకుండా ఇవ్వగానే బాలుకి మల్లి ఊపిరి వచ్చింది. అక్కడ దగ్గర్లో వారంతా పసుపు కుంకాలను నిలబెట్టుకున్నావ్ అన్నారు, ఇంతలో 108 వచ్చి కే జి హ్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. హార్పిక్ తాగటం వలన గొంతులో ఆహరం దిగే గొట్టం కాస్త ఆసిడ్ కి కాలిపోయింది. దాని మీద ఉరి ఆహారం తినే యోగం పోయాడు, డాక్టర్స్ టెస్ట్ చేసి తాను ఆహారాన్ని తీసుకోలేడు పానీయాలు మాత్రమే తీసుకోగలడు అన్నారు, సొల్యూషన్ గురించి డాక్టర్స్ అందరిని కనుక్కుంది. ఇంకా ఎండోస్కోపీ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటె తనకి నయం అవుతుందని చెప్పారు ప్రతి 7 రోజులకొకసారి చేయాలని దాని కాస్ట్ 5000 రూపాయలని చెప్పారు, చేతిలో చిల్లి గవ్వ లేదు ముందు వెనుక లేదు ఆదాయం లేదు, బాబు చూస్తే చంటి బిడ్డ సరే అని ఉద్యోగం లో చేరిన 10,000 కన్నా రాదు. ఎలా అనుకున్న సందర్భం లో రుషిక తల్లి  అన్నయ్య చూడటానికి వచ్చి వాడు చేసిన పాపం కి వాడు అనుభవిస్తాడు నువ్ ఇంటికి వచ్చే మనకే ఎం తక్కువ నువ్ ఈ బాధలు భరించలేవు అన్నారు, తల్లితో ఒకటే మాట అమ్మ సంపాదిస్తేనే మొగుడా సంపాదన లేకపోతే మొగుడు కాదా? నా భర్త చావు బ్రతుకులో ఉన్నాడు తల్లి తండ్రి కూడా వొదిలేసారు నేను వొదిలేస్తే ఎలా అమ్మ అని వాళ్ళ కు నచ్చ చెప్పింది, కూతురు కోసం ఎం చేయాలో తేలిక ప్రతి నెల వాడి ట్రీట్మెంట్ కి ఇంట్లో సరుకులు నేను కొనిపెడతా అని రుషిక తండ్రి వేరే ఇళ్ళు తీసి పెట్టారు.

అది కూడా అక్కడే ఉన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో తనకు తోడుగా ఉంటారని, వాళ్ళు అలాగే బిడ్డని క్కూడా చూసేవారు హాస్పిటల్ లో ఉండేప్పుడు రుషిక కష్టంని తన కష్టంగ భావించి తోడుగ నిలిచారు, ధైర్య నింపారు. ప్రతి వారం ట్రీట్మెంట్ కి తోడుగ వెళ్లేవారు, దగ్గరుండి అన్ని చూసుకొనే వారు, చెప్పాలంటే వాళ్ళు అండగా నిల్చోబెట్టి ధైర్యంగ ఉంది రుషిక, పిల్లలు కూడా చేదోడు వాదోడు గ కష్టం లో ఉన్నఅనే బాధ ని మర్చిపోయేలా ఇంట్లోనే ఉండేవారు, కానీ గంట గంట కు జ్యూస్ అని పాలూ అని ఏదో రకంగ తనకు నీరసం కాకుండా ఏదో ఒకటి అందిస్తూ ఉండేది. చంటి బిడ్డకు చేయాల్సిన సేవలు భర్తకు చేసింది, మాతృ ప్రేమని దూరం పెట్టి భర్తని బ్రతికుంచుకుంటే చాలు అనుకుంది. బిడ్డ ని తల్లి దగ్గరే వదిలి పెట్టింది. ఇంతలో బాలు ఏదో పని మీద బయటకు వెళ్లే సరికి అప్పు చేసిన వాళ్ళు పట్టుకొని రుషిక కు కాల్ చేసారు నువ్ అర్జెంటుగ 5 లక్షలు ఇవ్వకపోతే నే భర్త ని చంపేస్తాం అని, ఎం తోచని రుషిక వెళ్లి అక్క కు చెప్పింధీ అప్పుడే కొన్న కొత్త కారు తో అక్క వాళ్ళ భర్త ఆలోచించకుండా బీచ్ రోడ్ అంత తిరిగారు చేసేది ఎం లేక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, పోలీస్  వాళ్ళ బెదిరింపులకు తిరిగి బాలుని తీసుకొచ్చారు. ఆలా కొన్నాళ్లకు సజావుగా ఉన్నారు, ఇంతలో రుషికకు మంచి ఉద్యోగం వచ్చింది. ఐనా రుషిక తల్లి తండ్రులు కూతురు కష్టాలు పడకూడదని ఆర్ధిక సాయం చేస్తూనే వచ్చారు, బాలు కి కూడా మెల్ల మెల్ల గ చిన్నపిల్లలు తిన్నట్టు గ్రైండ్ చేసిన అన్నం తినేవాడు, తర్వాత మెత్తగా చేసిన అన్నం ని తినేవాడు, ఇలా 9 నెలలకు ప్రతి వారం వారం ఎండోస్కోపీ థెరపీ వలన తనకి బాగు అయ్యింది. కానీ మెత్తగా ఉన్నదే తినేవాడు, ఇంతలో రుషిక తన ఉద్యోగం లో కూడా మంచి ఎక్స్పర్ట్ అయ్యింది. ఇద్దరు బాగు పడ్డారు. ఆనందంగ ఉన్నారు, బాబు కూడా వన్ ఇయర్ దాటింది.

బాబు మురళి దగ్గరే పెరిగేవాడు, తనకి ఆదివరం సెలవు కావటం తో శని వారం రాత్రి బాబు దగ్గరకు వెళ్లిపోయి సోమవారం తెల్లవారే సరికి బయల్దేరి వచ్చేవారు. ఆ ఆది వారం బాబు తో ఉండచ్చు అని, బాలు కూడా నెమ్మదిగా ఫ్రీలాన్సెన్గ్ చేయటం స్టార్ట్ చేసాడు, చావు వరుకు వెళ్లి వచ్చా నెను ఇంకా చెడు వైపు వెళ్ళను అని చెప్పేవాడు, అందరు నమ్మరు బాలు లో చాల మార్పు వచ్చిందని కానీ ఒక రోజు నేను బండి సర్వీసింగ్ చేయించడానికి వెళ్తున్న అని చెప్పిన మనిషి రాత్రి ఐనా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్, ఎక్కడికి వెళ్ళాడో తేలీదు, అప్పటివరుకూ తన మనసులో తనకేమైనా ఆక్సిడెంట్ అయ్యిందా, లేక తన అమ్మ ని చూడటానికి వెల్లడా లేదా మొన్నటిలా మల్లి ఎవరైనా కిడ్నప్ చేసారా అని అనుకుంటునే, పక్కింటి కుర్రాళ్ళు వచ్చి మీ ఆయన మా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు ఈరోజు ఇచ్చేస్తా అన్నాడు ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు, మల్లి రమ్మీ ఆడేసి ఈసారి ఏకంగ వెళిపోయాడు తనని బాబు ని ఒంటరి చేసి అని, ఇన్నాళ్ళు పక్కనే ఉన్న వాడికి అప్పులు ఇచ్చేటప్పుడు ఎందుకు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడిగింది, మీతో చెప్తే మీఋ వదిలేసి వెలిపోతారని చెప్పాడు బాలు ఫామిలీ ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక చెప్పలేదు అన్నారు, పోలీస్ కేసు పెట్టారు కానీ ఏమి తెలియని రుషికని ఇన్వెస్టిగేషన్ చేసారు, ఊరిలో అంత పోలీస్ లు వచ్చి అడిగేసరికి వాడి గురించి వాడు చేసిన పనుల గురించి చెప్పి, ఆ అమ్మాయి దేవత అని చెప్పటం తో పోలీస్ లు కూడా వొదిలేసారు.

చేసేది ఎంలేక పుట్టెడు దుఃఖం తో మనసుని రాయి ని చేసుకొని బాబు ని చూసుకొని పుట్టినింటికి వచ్చేసింది, ధైర్యం తెగువ ఎం లేవు, కనుచూపు మేరలో బ్రతుకు కు దారి కనిపించటం లేదు. బావే నా జీవితం అనుకున్న రుషికని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, మోసం చేస్తూనే తనతో బ్రతికాడు, జీవితం మొత్తం అంధకారం లోకి తోసేసి వెళిపోయాడు. చెప్పాలంటే వాడి రమ్మీ గేమ్స్ కి అడ్డం గ ఉన్నదని తన జీవితం లోంచి తప్పుకున్నాడు, వేదవాలకి మంచి చెప్తే ఎలా ఎక్కుతాది? అమ్మ దగ్గర బాబు ఉన్నాడు ఇంకా చూసుకుంటారు బావ లేని జీవితం ఒంటరి జీవితం నాకు కూడా వొద్దు అని అనుకుంది, కానీ రుషిక మనసు తెలుసుకొని తల్లి గ తన కూతురికి ధైర్యం నింపింది తప్పు వాడు చేస్తే శిక్ష నీకెందుకు నువ్ నే బిడ్డ గురించి బ్రతకాలి అని చెప్పింది, ఎంతమందో ఆడవాళ్ళూ గతి లేక, చూసేవాళ్ళు లేక ఏడుస్తున్నారు, ఎప్పటికి నువ్ మాకు బరువు కాదు, తల్లి తండ్రులు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని ధైర్యం నింపింది, రుషిక కూడా తన వర్క్ లో తాను మునిగింది రోజు తలుచుకున్న బాలు దగ్గర నుంచి ఒక్క మెసేజ్ కానీ కాల్ కానీ రాలేదు, కొన్నాళ్లకు రుషిక మారింది చాల టైం తీసుకుంది మారేసరికి, కానీ ఎప్పటికి మర్చిపోలేదు, తప్పు చేసినది ఒకరు ఐతే కష్టాలు అనుభవించేవాళ్ళు ఒకరు, దేముడికి కూడా జాలి లేదు కష్టాలు కొలిమిలోకి తోసేసాడు.

మరి ఈ కథకు రుషిక జీవితానికి ముగింపు ఏ విధం గ ఉంటుందో ఆ దేముడే నిర్ణయిచాలి…

1 Comment on "జీవితం నేర్పిన పాఠం"

  1. скільки може тривати війна в україні коли закінчиться війна в україні 2022 коли закінчиться війна в україні передбачення

Comments are closed.