కన్నె.. కళలు

నిజమైన ప్రేమకు అర్ధం ఏంటే? జీవితాంతం కలిసి బ్రతకటం గొప్ప ప్రేమ ! లేక ప్రేమని త్యాగం చేయటం గొప్ప ప్రేమనే చెప్పవే కావ్య?ఈ డౌట్స్ ఇప్పుడు ఎందుకె శ్రావ్య నీకు , ఇంకా వన్ వీక్ లో మనకి సెమిస్టరు వస్తుంది. అది కాదే ప్రతి అమ్మాయి వచ్చే భర్త కోసం చాలా కళలు కంటుంది. పెళ్లి తర్వాత జీవితం పైన చాల ఊహలతో అడుగు ముందుకు వేస్తుంది.. అయినా ఎంత మంది సంతోషంగా ఉన్నారు పెళ్లిళ్లు చేసుకొని, ఎంత మంది బాధపడుతున్నారు?ఎంత మంది ప్రేమ పెళ్లిళ్లు జీవితాంతం కలిసి ఉంటున్నారు? ఎంతమంది విడిపోతున్నారు?ప్రేమ పెళ్లిళ్లు లో విడిపోతున్నారా? పెద్దలు కుదిర్చిన పెళ్లి లో విడాకులు ఉంటున్నాయా ? ప్రేమ అనేది ఉంటె విడిపోవటం దేనికి? పెళ్లి కి ముందు ఉన్న ప్రేమ చివరి వరుకు ఉండదా? పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోతుందా ? అయినా మనసు కూడా మారిపోతుందా ? ఎన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తె నేను సమాధానం చెప్పటానికి మేధావిని కాదు శ్రావ్య. అయినా ప్రశ్నల వర్షం ఎందుకె శ్రావ్య?

కావ్య మనం ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాం, ఇంకో వన్ ఇయర్ లో మన డిగ్రీ కంప్లీట్ ఐపోతుంది. నీకు తెలుసుగా సాదా సీదాగ మధ్యతరగతి కుటుంభంలో పెరుగుతున్నాం, ఎన్నో ఆశలు, ఎన్నో ఎన్నో కళలు ఉన్నాయ్. చిన్నప్పటి నుండి నాకు, కానీ ఇంట్లో పరిస్థితులు తెలిసి నేను అడగలేదు కానీ వాళ్ళ స్థాయికి మిచ్చి నన్ను పెంచారు నన్ను వాళ్ళకున్నంతలో నాకు ఏమి లోటు చేయాలేదు, మంచి బట్టలు, చదువు,తిండి అన్ని ఇచ్చారు కానీ చిన్న చిన్నసరదాలు ఒక పిక్నిక్ వెళ్లాలని, బీచ్ లకి వెళ్లాలని ఎప్పుడు ఇదే విజయనగరం లో ఉంటాం అంటే అమ్మ అంటూ ఉంటుంది. నీకు పెళ్లి అయ్యక నీ మొగుడు దగ్గర సరదాలు అన్ని తీర్చుకో అని , ఉదయానే అమ్మతో, నాన్న అంటున్నారు ఇంకా పెళ్లి చేసేయాలి అమ్మాయికి అని, అప్పటి నుండి నాకు ఈ ఆలోచనలు ఆగట్లేదు. ఎలాంటి భర్త రావాలి అని?

ఐతే ఎలాంటి ఊహలు ఉన్నాయ్ తమరికి ? ఎలాంటి అబ్బాయ్ రావాలనుకుంటున్నావ్ శ్రావ్య? నాకు నన్ను అర్ధం చేసుకొనే అబ్బాయ్ రావాలి, నన్ను చాల ప్రేమగా చూసుకోవాలి, నేనంటే చాలా ఇష్టం అయ్యి ఉండాలి. మరి నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నవే కావ్య! నాకైతే అబ్బాయ్ ఆరు అడుగులు ఉండాలి, చాల అందం గ ఉండాలి బోలెడు డబ్బులు ఉండాలి, నేను చిన్న తప్పు చేసిన తిట్టకూడదు, నన్ను ప్రేమగా చూసుకోవాలి షికార్లు, సినిమాలు అని ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా. నాకు అలానే ఉంది కాకపోతే నేను ఆరు అడుగులు, అందం అని చెప్పలేదు అంతేనే! కానీ ప్రేమించినోడు వచ్చిన బాగుంటుంది. తాను ఎలాంటివాడు అనేది తెలుస్తుంది. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా చాల మంది బాగుంటారు, వాళ్ళు పెళ్లి ఇయ్యక ప్రేమించటం స్టార్ట్ చేస్తారేమో కదా! కానీ నేను పెళ్లి అయ్యాక ఉద్యోగం అని బయటకు వెళ్ళను. హ్యాపీ గ ఇంట్లోనే ఉంటూ ఇంటిని పిల్లలని మావారిని వండిపెట్టుకుంటు మా అమ్మలా గడిపేస్తా కావ్య. కానీ నేను ఉండనే నాకు ఒక మంచి కోమనీ లో ఉద్యోగ చేసుకుంటా మా పక్కింటి అక్కల రోజుకో డ్రెస్ వేసుకొని, రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తా. ఏంటో ఎన్నో కళలు ఉన్నాయ్. మనకి ఎలా రాసిపెట్టి ఉందొ!

మీ ఊహలకు, ప్రశ్నలకు సమాధానం నేను చెప్తనే అంటూ పక్కనే వింటున్న కావ్య బామ్మా అంటూనే ఇలా రండి నా పక్కకు! పెళ్లి అనేది ఒక భారతీయ సంప్రదాయం, ప్రేమ పెళ్లిళ్లు అయినా , పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అయినా, ఇద్దరి మధ్యలో సఖ్యత, ఆలోచనలు ఒకటిగా ఉండటం, ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండటం, ఇద్దరు కలిపి ఒక నిర్ణయానికి రావటం ఉండాలి. అప్పుడు ఏ పెళ్లి కూడా పెటాకులు కానీ విడాకులు వరుకు కానీ రాదు. అది అందరి జీవితం లో ఒకలా ఉండదు. పెంచిన పెంపకం, పెరిగిన వాతావరణం, అలవాట్లు, చెప్పుడు మాటలు మనిషి మీద ప్రభావితం చేస్తాయ్. దానిని బట్టే మనిషి నడవడిక కూడా ఉంటుంది. కానీ కొంతమంది కొన్ని సగంటనలతో మారె అవకాశాలు ఉంటాయి, కానీ కొంత మంది మారె అవకాశాలు కూడా ఉండవు. చిన్నప్పటి నుండి ఎలా పెరిగిన మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సరైన నడవడిక ఉండాలి. ప్రతి ఒక్కరు తన జీవితం లో ఒక ఆశయం పెట్టుకొని దానిని సాధించాలనే తపనతో బ్రతకాలి, దాని ద్వారా ప్రతి ఒక్కరు సక్రమంగా నడుస్తారు. దాని ద్వారా వాళ్ళ జీవితం ముడి పడిన జీవితాలు కూడా ఆనందం గ ఉంటాయి. ఎలా ప్రతి ఒక్కరు ఉంటె మన సమాజం దేశం కూడా బాగుపడుతుంది. కానీ కొంత మందే ఆశయం తో బ్రతుకుతారు. కానీ జీవితం లో తిరగడం ఎంజాయ్ చేయటమే కాదు కష్టం సుకం రెండు ఉంటాయి ఏదేనా ధైర్యం గ ఎదుర్కోవాలి.ఎక్కువగా ఆలోచించకుండా చదువుకోండి. మీ రథాల బట్టి భగవంతుడు మీకో అబ్బాయ్ ని పంపిస్తాడు! ఊహలు చేసినంతమాత్రాన రాతలు మారిపోవు అంటూ బామ్మా లోపలి వెళ్లిపోతుంది. మన శ్రావ్య, కావ్యాల ప్రశ్నలకు సమాధానాలు దొరికాయ్….