ఆధునిక పోకడలు

వనజ లెగవే లెగు, ఇంకా పడుకున్నావేంటి ఈరోజే మన రిజల్ట్స్ టెంపుల్ కి వెళ్దాం రా అంటూ కావ్య లేపుతుంది. అబ్బా లేస్తాలే ఇంకా 5: 30 గా అయ్యింది. ఇంత పొద్దున్నే వచ్చావేంటి బాబు.  నువ్వు వేళ్ళు టెంపుల్ కి నేను రాను పడుకుంటాను.  గంట తర్వాత వనజా వనజా….. అని కేకలు వేస్తూ  ఆనందంతో పరుగులు పెడుతూ వచ్చింది కావ్య.  ఏమిటే కావ్య ఆ కేకలు ఎదిగిన పిల్లవి, ఏమిటా ఆ పరుగులు అంటూ వనజ వాళ్ళ నాన్నమ్మ.. ఏమిటో ఈ కాలం లో పిల్లలుకు బొత్తిగా పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా పోయింది అని నోడుముతుంది . కానీ అవి ఎం పట్టించుకోకుండా తిన్నగా ఇంట్లోకి అరుస్తూనే వెళ్ళింది అప్పుడే స్నానం చేసి వచ్చిన వనజ చేతిలో పేపర్ పెట్టి, నువ్వు నువ్వు ఆయాసంగా స్టేట్ ఫస్ట్ వచ్చావే. నీ ఫోటో పేపర్ లో పడింది అని గట్టిగ అరిచింది. దానితో సంతోషం తో ఒక్కసారిగా ఎగిరి గంతేసి, కావ్య ని గట్టిగ పట్టుకొని థాంక్స్ చెప్పి, అమ్మ అమ్మ అంటూ ఇల్లంతా వెతికింది కనపడలేదు. నాన్న నాన్న అంటూ వీధి చివరకి వెళ్లి అక్కడ ఉన్న అరుగు దగ్గర చూసింది నాన్న కూడా కనపడాలేదు, ఇంతలో వాళ్ళ నాన్నమ్మ చెప్పింది, మీ అమ్మ నాన్న పొలం కి వెళ్లారు.  ఏమిటో అంత కేకలు వేస్తున్నావ్ ఎం జరిగింది? నేను  నేను స్టేట్ ఫస్ట్ వచ్చా నాన్నమ్మ అని వనజ చెప్పేసరికి సరేలే నువ్ ఎంత ఫస్ట్ వచ్చిన ఫై చదువులు చదవవు గా అని ఒక్క ముక్క అనేసి తన ఆనందం మొత్తం ఒక్క ముక్కతో ఆవిరి చేసింది వాళ్ళ నాన్నమ్మ. ఇంతలో పొలం కి వెళ్లి అమ్మ నాన్న కి పేపర్ చూపించి నేను స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా అని చెప్పింది . దానితో అక్కడే ఉండి పొలం పనులు చేస్తున్న వారి అందరికి ఓ ఎల్లమ్మ, పుల్లమ్మ, సీతమ్మ, లక్షమ్మ, సూరీడు, శీను, నాగులు మా అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందంట. మధ్యాహ్నం అందరు పనులు అయ్యాకా ఇంటికి  రండి నోరు తీపి చేస్తా అని కూతురు తో సహా వెళ్లిపోయింది. వనజ వాళ్ళ అమ్మ సంతోషంగా, ఇంతలో ఇంటి దగ్గర వనజ వాళ్ళ స్కూల్ మాస్టర్స్ టీచర్స్ మరియు మీడియా వాళ్ళు అంత ఇంటి దగ్గర ఉన్నారు. వనజ ధీ ఒక మరు మూల పల్లెటూరు, చిన్నప్పటి నుంచి తనకి చదువు అంటే ఎంతో ఇష్టం, తల్లి తండ్రికి చదువు లేకపోయినా వనజ ఎంతో ఇష్టం తో చదివేది. తన తెలివితేటలను, చదువు లేదా తనకున్న ఇష్టం  ను చూసి  చూసి స్కూల్ లో 10 వ తరగతి పిల్లలకు హెడ్ మాస్టర్ స్కూల్ లో అదనపు  క్లాస్ లు పెట్టి మరి చదివించేవారు.. 

అలాగే వారి శ్రమను వృధా చేయకుండా స్టేట్ ఫస్ట్ వచ్చింది వనజ, అది మారుమూల పల్లెటూరు విశాఖపట్నం కి 30 కి మీ దూరం లో ఉంది. అక్కడకు వెళ్ళడానికి బస్సులు కూడా విశాఖపట్నం నుండి పొద్దున్న మరియు రాత్రికి మాత్రమే ఒకటే బస్సు ఉంది. మీడియా వాళ్ళు స్కూల్ వాళ్ళు వచ్చి తనతో మాట్లాడక ఆరోజు అంత హడావిడిగా ఐపోయింది.  అమ్మ పొలం కి వెళ్ళక ముందే లేచి అమ్మ తో మాటాడాలి అని అనుకోని రాత్రి పడుకుంది. మరుసటి రోజు పోద్దినే అమ్మ తో వనజ అమ్మ నేను ఫై చదువులు చదువుకుంటే అమ్మ అని అడిగింది. ఇంతలోనే వాళ్ళ నాన్నమ్మ ఏ చదువులు ఇంకా వొద్దు ఆడపిల్ల కి 10 చదవడం ఎక్కువ, మన ఊరిలో కాలేజీ లు లేవు నువ్ చదవాలి అంటే విశాఖపట్నం వెళ్ళాలి,  అక్కడ హాస్టల్ లో ఉండాలి ఏవి అన్ని కుదిరే పని కాదు ఇంకా ఆశలు పెట్టుకోకు అని అన్నారు, ఇంతలో పెద్ద కాలేజీ వాళ్ళు మీ పాపని మా కాలేజీ లో జాయిన్ చేయండి ఫ్రీగ చెదివిస్తాం అని చెప్పారు.  హాస్టల్ ఖర్చులకి మా దగ్గర డబ్బులు లేవండి అని చెప్పగా హాస్టల్ కూడా ఫ్రీనే మీ అమ్మాయి ని మా కాలేజీ లో జాయిన్ చేయండి అని జాయిన్ చేయించుకున్నారు, ఫ్రీ గానే చదివిస్తాం అనగానే వనజ నాన్న అమ్మ ఒప్పుకున్నారు.మరియు వాళ్ళ నాన్నమ్మ ని కూడా ఒప్పించారు. వనజ తో పాటు కావ్య కూడా ఇంటర్ విశాఖపట్నం లో జాయిన్ అయ్యింది, అనుకున్నట్టు గానే కాలేజీ వాళ్ళ ప్రోత్సాహం తో  ఇంటర్ లో కూడా మంచి మార్కులతో స్టేట్ సెకండ్ మరియు ఎంసెట్ లో కూడా 10 వ రాంక్  తెచ్చుకుంది. కావ్య కూడా మంచి మార్కుల తో పాస్ అయ్యింది. మరియు 45 వ రాంక్ తెచ్చుకుంది . కానీ మల్లి కాలేజీ లో  జాయిన్ అవ్వటానికి అమ్మ, నాన్న, నాన్నమ్మ ఒప్పుకోవాలి అనుకోని అడిగారు, ఎప్పుడు వొద్దు అనే ఇంట్లో, నువ్వు ఎంత వరుకు చదువుతావో అంత వరుకు చదువుకో డబ్బుల గురించి ఆలోచించకు అని వాళ్ళ నాన్నమ్మే  చెప్పింది. చదువు అందరికి అబ్బదు, నీకు ఆ సరస్వతి దేవి వరం ఇచ్చింది దాన్ని దూరం చేయటం నాకు ఇష్టం లెదు అని అంత  ఒప్పుకున్నారు.

హైదరాబాద్ కాలేజీ లో సీట్ వొచ్చింధి. సిటీ కొత్త కదా పైగా చాల పెద్ద కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ లో మొదటి రోజు, 10 వ తరగతి లో మరియు ఇంటర్ లో బంధించి మరి చదివించేవారు, చదువు మాత్రమే తెలుసు అప్పటి వరుకు, అది కూడా గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ కాలేజీ , ఇంజనీరింగ్ లో ఆలా కాదు చదువు తో పాటు  ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కోఎడ్యుకేషన్ ఉంటుంది. మొదటి రోజు కదా బిత్తరగా భయంగ అంత పెద్ద కాలేజీ లో  ఎలార బాబు అనుకుంటేనే వనజ, కావ్య అడుగు పెట్టారు.  సీనియర్స్ అంత జూనియర్స్ కి రాగ్గింగ్ చేస్తున్నారు, ఏది అంత చూస్తూ ఒక చెట్టు కింద నిలబడి చూస్తుండగా పక్కనే  ఒక సీనియర్ అబ్బాయ్ అరేయ్ ఎక్కడ చూడండి. పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఉన్నారు, అని మిగతా వారికీ పిలిచాడు, వాళ్ళు కూడా దగ్గరగా వొఛ్చి ఎంసెట్ రాంక్ అడిగారు. ర్యాంకులు చెప్పగా సరస్వతి దేవీలు వొచ్చారు అంటూ వాళ్ళని ఏడిపించి వదిలేసారు, ఇంతలో హాస్టల్ లో రూమ్ చూసుకొని నెక్స్ట్ డే క్లాస్ కి వెళ్లారు. అక్కడ అంత గర్ల్స్ బాయ్స్ అని తేడా లేకుండా  పక్క పక్క నే కూర్చొని ఉన్నారు. పైగా అమ్మాయిలు అంత జీన్స్ , టీ షర్ట్ వేసుకొని అందంగ రెడీ అయ్యి వచ్చారు,

వనజ మరియు కావ్య లది పల్లెటూరు పైగా చదువు మాత్రమే తెలుసు. అప్పటివరకు అందం మీద కానీ డ్రెస్సులపైనా కానీ ద్రుష్టి పెట్టని వాళ్ళు, కానీ వారిని చూసి అంత ఎర్ర బస్సు ఎక్కి వచ్చారు అని ఎగతాళిగా మాటాడారు. దానితో చిర్రెత్తిన వనజ, కావ్య లు  మిగతా ఆడపిల్లలని చూసి అబ్బా వాళ్ళు చాల మంచి డ్రెస్సులు వేసుకున్నారు మనం మాత్రం పల్లెటూరు అమ్మాయిలు అని గుర్తు పట్టేలాగా చూడు ఎలా ఉన్నామో అని ఇంకా ఆ రోజు రాత్రే షాపింగ్ కి వెళ్లి కొన్ని డ్రెస్సులను కొనుక్కున్నారు. పార్లోర్ కి వెళ్లి హెయిర్ కటింగ్, ఇంకా కావాల్సినవి  అన్ని చేయిచుకొని రెండు రోజులు ఆగి కాలేజీ కి వెళ్లారు. ఇంకా వేళ్ళని చూసి అబ్బాయిలు అంత ఎవరు ఏది వరుకు కాలేజీ లో చూడలేదే అన్నట్టు నోళ్లు వెళ్ళబెట్టి మరి చూసారు.  చుస్తే వనజ, కావ్య లు ఇంకా వేళ్ళతో కూడా నడరు ఫ్రెండ్షిప్ గ ఉండేవారు, డబ్బులు మాత్రం విపరీతం గ ఖర్చుబెట్టారు. ఇంతలో సెమిస్టరు ఎగ్జామ్స్ అని చెప్పారు. అందం మీద ద్రుష్టి పెట్టిన మిగతా వాటికీ టైం ఇవ్వలేదు కనుక మల్లి ర్యాంకేర్స్ గ నిలిచారు, ఇంకా కాలేజీ లో ఒక మారు మోగింది వళ్ళ పేర్లు చదువుతో పాటు అందం తో పాటు అన్ని ఉన్నాయ్ అని,  అమ్మాయిలు  మాములుగా ఉంటేనే వదలని అబ్బాయిలు వేళ్ళని వొదులుతారా? అలానే వనజ ని కావ్య ని ఇష్ట పడ్డారు.  కానీ వనజ, కావ్య లు ఎవరికీ ప్రేమ దోమ అంటే నచ్చదు అని తెగేసి చెప్పి చదువు మీద ద్రుష్టి పెట్టారు. ఇదిలా ఉండగా 2 వ సంవత్సరం వచ్చింది.  ఇంట్లో తల్లి తండ్రులు కూడా ప్రేమ, దోమ అని తిరగద్దు అని చెప్పి పంపారు.

కాలేజీ కి మల్లి తిరుగు ప్రయాణం పట్టారు. ట్రైన్ లో వాళ్ళతో పాటె వాళ్ళ కాలేజీ లో చదువుతున్న ఇద్దరు అబ్బాయిలు రాజేష్, శ్రీను. వనజ కావ్య వాళ్ళు ఎలా  బెస్ట్  ఫ్రెండ్స్ నో వాళ్ళు కూడా అంతే. ఐతే వీరీ సీట్ దగ్గరనే వాళ్ళ సీట్ కావడం తో అంత కలిసే వెళ్లారు. ట్రైన్ లో పరిచయాలు బాగా పెరిగాయ్. వనజ కి రాజేష్ మరియు కావ్య కి శ్రీను ట్రైన్ లోనే ప్రొపోజ్  చేసారు. రాజేష్ శ్రీను లు కూడా వేళ్ళ లగే బాగా చదువుతారు, కాలేజీ లో కూడా పెద్దగా అల్లరి చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. అది ముందు నుంచి అబ్సర్వ్ చేస్తున్న వనజ, కావ్య లు వెంటనే ఒప్పుకున్నారు, కానీ మనం ప్రేమ పేరుతో చదువుని పక్కన పెట్టకూడదు అనుకుంటారు. ఇంకా ప్రేమ స్టార్ట్ ఐతే మనసు తేలికగా ఉంటదా? ఇప్పుడు ఎం చేస్తున్నారు ? ఎక్కడ ఉన్నారు అని వాళ్ళ ఆలోచనలే, ఫోన్ లు చేసుకొనేవారు, కాలేజీ కి కలిసే వెళ్లేవారు. కాలేజీ అయ్యాక హైదరాబాద్ లో ఒక్కో రోజు ఒక్కో ప్లేస్ కి వెళ్లేవారు, వేళ్ళ ప్రేమ కబుర్లకి రోజు సరిపోయేది కాదు, కానీ రోజు లేట్ గ వస్తున్నా వేళ్ళని హాస్టల్ లో వార్డెన్ ఒప్పుకోవట్లేదు అని రూమ్ తీసుకున్నారు ఇంకా ఈ ప్రేమ పక్షులకి అడ్డు ఆటంకం ఉండకుండా తిరిగేవారు. ఎంతగా మునిగి పోయారు అంటే ఒకరిని ఒకరు వొదిలి ఉండలేనంతగా ప్రేమలో మునిగి పోయారు. కాలేజీ కి వెళ్ళటం వొచ్చాక రూమ్ లో చదవటం ఇంకా ఆపై బయట తిరగటం అన్ని జరిగేవి. కాలేజీ లో తొలియనోళ్లు లేరు ఆ నలుగురు ప్రేమ జంటలని ఇంకా సెమిస్టరు రాణే వొచింది. కానీ ఈ సారి నలుగురికి సబ్జక్ట్స్ ఉండిపోయాయి. కానీ చాలా తేలికగా తీసుకున్నారు. నెక్స్ట్ సెమిస్టరు ఉంది గ అని.

మల్లి ఈ ప్రేమ జంటలు ఈ సారి హద్దులు దాటి ఒకటే రూమ్ తీసుకున్నారు నలుగురు, పెళ్లి కాకా ముందే ఎలా ఉండటం వొద్దు అనుకున్నారు కానీ రాజేష్ శ్రీను లు చెప్పటం తో ఒప్పుకున్నారు, పెళ్లి మాత్రమే కాలేదు కానీ ప్రేమ జంటలు అన్ని హద్దులు దాటారు. దానితో ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయ్యింది వనజ కి, చాల బయపడి పోయారు, ఎం చేయాలో తెలియలేదు ఇంతలో కావ్య కి కూడా ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయ్యింది.  ఎలా అనుకోని రాజేష్ మరియు శ్రీనులకి పెళ్లి విషయమై అడిగారు. మనం ఇంకా సెటిల్ కాలేదు, ఇప్పటికి తీయుంచుకోండి, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉందాం అని చెప్పారు. పిల్స్ వేసుకున్నారు. కానీ మనసులో ఎక్కడో తెలియని బాధ, తల్లి తండ్రులని మోసం చేసాం అని, మనల్ని మనం ఆధునిక పోకడలకు వెళ్లి చివరికి ఈ దుస్థితి తెచ్చుకున్నాం అని ఇద్దరు అనుకున్నారు. తిరిగినంత కాలం తిరిగి, పెళ్లి మాట ఎత్తగానే ఎస్కేప్ అయ్యారు అని రాజేష్ శ్రీను ల గురించి అర్ధం చేసుకొన్నారు. అప్పటికే ఇద్దరికి చేయి దాటింది. సెమిస్టరు లో 6 సబ్జక్ట్స్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళ పరిస్థి తి ని తెలుసుకున్నారు. దానితో వారితో పటు ఉన్న రూమ్ ని కాళీ చేసి వేరే రూమ్ తీసుకొని చదువు మీద ద్రుష్టి మళ్లించారు.  ఒకటే లక్ష్యంగ పెట్టుకొని చదివారు సబ్జక్ట్స్ అన్ని కంప్లీట్ చేసారు. క్యాంపస్ లు రాణే వొచ్చాయ్. ఇద్దరు మంచి కంపెనీ లో జాబ్స్ కొట్టారు.  రాజేష్ శ్రీను లకి కూడా మంచి జాబ్స్ వొచ్చాయ్. తిరిగి వనజ కావ్య ల దగ్గరకు పెళ్లి చేసుకుంటామని వొచ్చారు. కానీ ఒక సారి మోసపోయిన వనజ, కావ్య లు నిరాకరించారు. ఇంటికి తిరిగి ముఖం పట్టారు.  తల్లి తండ్రులకు గర్వం గ వాళ్ళు జాబ్స్ తెచ్చుకున్నారని చెప్పారు. ఇంతలో రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న శ్రీను వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ ఊరికి బయలు దేరి సంబంధం మాటాడనికి  వెళ్లారు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసారు.

నోట్: ఆధినిక పోకడలకు వెళ్లుచు కానీ హద్దులు దాటకూడదు. ఏది తప్పు ఏది రైట్ అని మనం చేసే ప్రతి పనికి తెలుసు కానీ మనసు చెప్పింది వింటే తప్పు విప్ వెళ్తాము. కానీ మెదడు చెప్పింది వింటే తప్పు చేయడానికి ఆలోచిస్తాము. జరిగిన తప్పు ను సరిదిద్దుకోలేము కానీ దాని ద్వారా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు వొదలకుండా జీవితాన్ని సరైన దారిలో తెచ్చుకోవాలి. సాధించాలన్న, పతనం అయినా మన చేతిలోనే ఉంటది.

.