అనామిక

రేయ్ విక్కీ ఏం చేస్తున్నావ్ రా ? ఐనా మొహం ఏంటి అలా పెట్టావ్ ? ఇప్పుడు ఏమైందని? అయినా మూడ్ మార్చారా నువ్ ఆలా మౌనం గ ఉంటె నాకు అసలు ఎం బాలేదు! ఉండరా రాఖీ, ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంటే వినట్లేదు.విక్కీ నేను ఒకటి చెప్పనా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుంది గా, అయినా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావ్ 30 వచ్చాక కూడా 3 ఏళ్ళు లాగండి అంటే ఎవరు వినరు. అయినా మీ పేరెంట్స్ కుడా ఉంటుంది గా. నీకు ఫామిలీ ఉండలని, నీకు పుట్టే పిల్లలతో ఆడుకోవాలని, ఇంకేమనకు వాళ్ళకి ఫోన్ చేసి ఒకే చెప్పేయ్. అదేంటి రా ఆలా అంటావ్ నా సంగతి నీక్ తెలిసి కూడా.. విక్కీ నేను చెప్పేది నువ్ ఫాలో అవుతావు కదా ముందు అమ్మ వాళ్లకు కాల్ చేసి మీ ఇష్టం అని చెప్పు. సరేరా రాఖీ నీ మాటే నా మాట! అమ్మ నేను విక్కీ ని రేవు బయల్దేరి వస్తున్నా అమ్మాయి ని చూడటానికి, నువ్ అన్ని రెడీ చెయ్ వాళ్ళతో మాట్లాడి అంటూ ఫోన్ పెట్టేస్తాడు..

వెంటనే తిరుపతి బయల్దేరి విక్కీ ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి అమ్మ ఏదో మాట్లాడాలన్నా అవకాశం ఇవ్వలేదు. మరుసటి రోజు వేకువ జామునే రాజముండ్రి బయలుదేరాలిగ అమ్మ, నాకు జర్నీ లో చిరాకు ఉంది, నేను రెస్ట్ తీస్కుంటా అంటూ రూమ్ లోకి వాలిపోయాడు. మరుసటి రోజు ఉదయానే కారులో బయల్దేరారు, రాజముండ్రి వచ్చింది, అక్కడ పచ్చని పైర్లు, ఎటు చుసిన కొబ్బరి చెట్లు, అక్కడక్కడా కొలనులు, ఎక్కడ చుసిన పచ్చదనం తో ఆ వాతావరణం చూడగానే భూమాత పచ్చని పైర్లు తో చీర కట్టినట్టు ఉంది. అక్కడ వీస్తున్న చల్లని గాలి ఎవరు ఎంత చికాకుల్లో ఉన్న మర్చిపోయేలా ప్రశాంతం గా ఉంది. ఇంతలో విక్కీ కార్ దిగి సెల్ఫీ తీసుకుందామని అటుగా వెళ్తున్న ఒక అమ్మాయి ని చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి అందం ని చూస్తూ ఒక్కసారిగా లోకం స్తంభించినట్టు. గుండెల్లో గంటకొట్టినట్టు, ఏదో అద్భుతం భూలోకం లోకి దిగివచ్చినట్టు, ఊపిరి ని బిగపెట్టి మరి చూస్తూ ఉండిపోయాడు.

ఇంతలో అరేయ్ విక్కీ అంటూ అమ్మ పిలుస్తే ఈ లోకం లోకి వచ్చి, ఆ అమ్మ ఆ అమ్మాయి ని చూస్తున్న అంటూ చూపించాడు, అమ్మ చూస్తూ ఆ అమ్మాయి నే మనం చూసుకోడానికి వచ్చింది అని చెప్పేసరికి, ఓకే ఎలా అయినా ఈ అమ్మాయిని చేసుకుంటా అంటూ అమ్మాయి (హారిక) ఇంటికి వెళ్తాడు. చూస్తూనే ఆ అమ్మాయి రావటం, ఇంట్లో వాళ్లంతా ఒకే చెప్పడం తో విక్కీ, నేను పర్సనల్గ తనతో మాట్లాడాలని చెప్పడంతో ఆ ప్రైవసీ ఇస్తారు. హారిక నిన్ను చూడగానే నాకు చాల నచ్చ్చావు, అసలు పెళ్లి చేసుకోను అనే నేను నీ అందానికి, నీ ఫామిలీ తో మాట్లాడటం ద్వారా నీ చూపుల్లో కనిపించే ఆ అమాయకత్వానికి, నాతో మాట్లాడుతూ ఉంటె స్వరాలూ పలికేలా వినిపించేట్టు నీ స్వరానికి నేను ఫిదా ఇపోయా. నీతో నా జీవితం 100 సంవత్సరాలు ఉండాలనుకుంటున్న, నీకో ఫ్రెండ్లా ఉంటా, నీకు ప్రపంచం మొత్తం చూపిస్తా, నిన్ను చాల ప్రేమగా చూసుకుంటా నన్ను పెళ్లి చేసుకుంటే ! నువ్వు నాకు దొరకడం నా అదృష్టం గా భావిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. నీకు ఇస్టమా కదా అభిప్రాయం చెప్పు అనగానే ఇష్టమే అంటూ తలా ఊపి సిగ్గు తో అక్కడినుండి వెళ్లిపోయింది.

అదే రోజు ప్రదానం చేసుకొని ముహుర్తాలు కూడా ఫిక్స్ చేశారు. మరో 15 రోజుల్లో పెళ్లి. ఇంతలో హారిక పెళ్లి చూపుల్లో తన అందాన్ని మెచ్చుకుంటూ, తన జీవితానికి భరోసా ఇచ్చే విక్కీ మాటలను తలుచుకుంటూ, మురిసిపోతూ అందరితో చెప్పుకొనేది, నే అంత అదృష్ట వంతురాలు ఎవరు లేరు, ఎంత అదృష్ట దేముడు నీకు ఇచ్చాడు అని అందరు అనగానే మురిసిపోతూ, పెళ్లి రోజు రాణే వచ్చింది, ఎంతో ఆనందం గా తన మేడలో మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నాడు విక్కీ. మంచి సంబంధం వచ్చినందుకు కూతురిని అంగరంగ వైభవం గా పెళ్లి చేసి అప్పగింతల్లో హారిక తల్లి తండ్రలు ఒకటే చెప్పారు, నా బంగారు తల్లి హారిక, మా ఇంటికి వెలుగు, సిరి సంపదలు ఇచ్చే లక్ష్మి దేవిని ఎలా హుసుకుంటామో మా ఇంట్లో హారిక ని అలానే చూసుకున్నాం. మా పరువు, మా సిరులు, మా ఇంటి దీపం ,మా ఇంటి వెలుగు, నవ్వులు అన్ని మా హారిక నే, మీరు తనకి ఎ కష్టం రాకుండా ప్రేమగా చూస్తారని నమ్మకం తో మీ చేతిలో పెడుతున్నాం జాగ్రత్త బాబు అంటూ అప్పగించారు.

అప్పగింతలు అయ్యాక, విక్కీ ఉన్న హైదరాబాద్ నేరుగా చేరుకున్నారు, విక్కీ పెట్టిన హాలిడేస్ కూడా ఐపోయాయి, పెళ్లి జరిగి 15 రోజులు కావస్తుంది, రోజు విక్కీ ఇంటికి రావటం, హారిక కు కావాల్సినవి, ఇంటికి కావాల్సినవి, తనకు ఇష్టమైనవి అన్ని తెస్తూ ఉన్నాడు, కానీ పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమం ని మాత్రం జరగలేదు, మరో 15 రోజుల తర్వాత ఇంటికి వస్తూనే హరిక తో, హారిక నీకో సర్ప్రైజ్ అంటూ వచ్చాడు, ఏంటో అనుకుంటూ ఆశ గ చూసేసరికి హనీమూన్ టికెట్స్ అంటూ చూపిస్తాడు. థాంక్స్ అంటూ విక్కీ ని ఒక్కసారిగా గట్టిగ పట్టుకొని ఓకే ముద్దు పెడుతుంది, సరే స్ట్రర్ట్ అవ్వు బట్టలు సర్దుకో తెల్లవారి జామున ఫ్లైట్ అంటూ బయల్దేరుతారు, ఊటీ, కేరళ, కొడైకెనాల్,ఢిల్లీ, హిమాలయాస్, అమృతసర్అన్ని చూసి ఓ 20 డేస్ ట్రిప్ తిరిగి తిరుగు ప్రయాణం పడతారు. కానీ హారిక లో తనకి కావాల్సినవి అన్ని చూపించిన, తనకి నచ్చినవి అన్ని కొని పెట్టిన ఒక భర్తగా తన దగ్గర ఉండే ఆ సాన్నిహిత్యాన్ని మాత్రం పొందలేక తనలో థానే మధనపడుతూ, విక్కీ ని ఎలా అడగాలో అర్ధం కాకా ఈరోజు ఎలా అయినా అడగాలి అనుకుంటూ, భర్త గురించి వెయిట్ చేస్తుంది,
ఇంతలో విక్కీ వస్తూనే హారికా డల్ గ ఉండటం గమనించి , ఏమయ్యింది అని అడిగాడు. ఏడుస్తూనే చెప్పటం స్టార్ట్ చేసింది.

ఎన్నో ఆశలతో , మరెన్నో ఊహలతో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న, మీరు పెళ్లి చూపుల్లో నన్ను ఎంతగా ఇష్టపడరో, నన్ను ఎలా చూసుకుంటారో, అన్ని చెప్పగానే ఎంతో మురిసిపోయి, ఎంతో సంతోషం గ నేను ఒప్పుకున్నా. కానీ అని చెప్తూ ఇచ్చే గ్యాప్ లో విక్కీ కానీ నేక్ ఎం తక్కువ చేసా, నిన్ను ఎప్పుడైనా బాధపెట్టానా? నీ వంట బాలేదని , మీ వాళ్ళు కట్నాలు కానుకలు తక్కువ ఇచ్చారని నెం ఏమైనా అన్ననా?నీకు ఎం తక్కువ చేయను చెప్పు అంటూ రివర్స్ ఇయ్యడు. ఏడుస్తూనే హారిక చెప్పలేక చెప్తుంది, ఏది తక్కువ అంటే ఎం చెప్పాలి? ఒక భార్యగా నన్ను ఎప్పుడైనా దగ్గరగా తీసుకున్నావ? మ్యారేజ్ తర్వాత జరగాల్సిన ముచ్చట మనకి జరగలేదు, ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించిన మేలో చలనం రావట్లేదు, పోనీ నేను ఇష్టపడలేదా అంటే నన్ను అద్భుతం గ చూస్తున్న ఫై నుంచి దిగి వచ్చిన అప్సరస అంటు నన్ను పొగుడుతారు అంటూ ఏడుస్తుంది ఎం జరిగింది ఎందుకు నన్ను దగ్గరకు తీసుకోవట్లేదు అంటూ ఏడుస్తుంది. అంతలోనే విక్కీ ఒక నిజం చెప్పాడు తాను ఒక హోమో సెక్సువల్ అని, ఎన్నో సార్లు ట్రై చేశా, కానీ నీతో నువ్ ముట్టిన నువ్ హాగ్ చేసుకున్న, నన్ను కిస్ చేసిన నాకు ఎలాంటి ఫీలుంగ్ రాలేదు అని , హారిక కు గుండె పగిలినట్టు అయ్యింది.

ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది అని అడిగింది? పెళ్లి కి ముందే నేను మా ఫ్రెండ్ తో ఉండేవాడిని, అప్పుడే తనకు అలవాటు అయింది అని చెప్పాడు, తెలిసి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్ అని హారిక గట్టిగ అడిగింది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్, ఎన్నో తీపి కబుర్లు చెప్పావ్, నా జీవితం తో ఆడుకున్నావ్ అంటూ ఏడుస్తుంది. పెళ్లి చూపుల్లో చెప్పినవి అన్ని అబద్ధాలేనా అంటూ..లేదు లేదు హారిక నిజం గానే నాకు చాల చాల నచ్చావ్. నేను నీకు అబద్ధాలు చెప్పలేదు, నేనేం చెప్పానో గుర్తు చేసుకో, అన్ని నీతో ఎంతవరుకు చేసానో లేదో చెప్పు, చెప్పినవి అన్ని చేశా. ఆ ఒక్క విషయం లో యాంత్రికం గ చేయడం ఇష్టం లేదు. మా ఫ్రెండ్ చెప్పాడు తనతో ఉంటూనే నీతో కూడా ఉండచ్చు అని అది పెద్ద మేటర్ కాదని, టాబ్లెట్స్ కూడా వాడుతున్న, త్వరలోనే ఇద్దరం ఒకటి అవుతాం, కానీ ఏ విషయం నువ్ బయట చెప్తే నా పరువు న కుటుంభవ్ పరువు పోతుంది. నువ్ అంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నేను వొదులుకోలేను అంటూ బ్రతిమిలాడుతాడు.

హారిక ఏడుస్తూ మీ అమ్మ గారికి కూడా తెలుసా మీ గురించి, తన దగ్గర కూడా దాచారా అంటూ అడిగింది, అమ్మ కి కూడా తెలుసు కానీ పెళ్లి ఐతే అన్ని సర్దుకుంటాయి అని చెప్పారు అనే సమాధానం ఎంతో బాధనిచ్చింది. వెంటనే అత్తగారికి కాల్ చేసి మాటాడింది. మీ అబ్బాయ్ గురించి నాకు తెలిసింది నన్నేం చేయమంటారు అంటూ.. బయటకు చెప్పకు తాను మందులు వాడితే తగ్గుతుంది అంటూ చెప్పుకొస్తుంది. బయటకు చెప్తే మా పరువు పోతుంది, అలానే భర్త అలా అని తెలిసాక నీ పరువు పోతుంది, తెలిసిన వాళ్ళు నీకు హెరాస్మెంట్ కూడా చేస్తారు. వాడు మారె వరుకు సర్దుకో అని చెప్తుంది. అప్పుడు హారిక అడుగుతుంది మీరు కూడా ఒక ఆడవారే, ిన మీకేనా పరువు ఉండేది, మాకు ఉండదా, మీ అమ్మాయి కి ఇలానే సర్దుకోమనే చెప్తారా? నాకు ఆశలు, కోరికలు, సరదాలు ఉండవా? అంటూ ఏడుస్తూ అడుగుతుంది. పుట్టినింటికి తిరుగు ప్రయాణం పట్టింది. ఇంట్లో తన విషయం చెప్పింది, మరి నా కధకు ముగింపు ఏంటో ఎలా బ్రతుకు ని సాగించాలో దేముడే నిర్ణయిచాలి అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది.

కానీ ఇలాంటి ఎంతో మంది మగవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఆడవారు కూడా ఒక ఫామిలీ ఉంది వాళ్ళకి పరువు ఉంటుంది, అన్నిటికి సర్దుకొని ఏదోలా భరిస్తూ ఉండనవసరంలేదు.